Telugu Global
NEWS

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి.. బిగ్‌ న్యూస్‌!

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఆ చిత్ర యూనిట్‌ కూడా నమ్మకంతో ఉంది.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి.. బిగ్‌ న్యూస్‌!
X

‘సలార్‌’ హిట్‌తో జోష్‌ మీద ఉన్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఇది మరో బిగ్‌ న్యూస్‌.. భారీ బడ్జెట్‌తో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’ రిలీజ్‌ డేట్‌పై ఆ చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రభాస్‌ని పవర్‌ఫుల్‌ యోధుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన పోస్టర్‌తో దీనిని రివీల్‌ చేసింది.

వైజయంతి మూవీస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్‌ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కీలకమైన పాత్రలో కనిపించనుండగా, కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే ఒక హింట్‌ కూడా ఇచ్చారు. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో ఉండబోతోందని చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ఆ చిత్ర యూనిట్‌ కూడా నమ్మకంతో ఉంది. ఈ సినిమాను పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో విడుదల చేయాలని వైజయంతి మూవీస్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచే ఈ చిత్రంపై అప్‌డేట్స్‌ ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తూ హైప్‌ పెంచుతోంది. ఏది ఏమైనా ప్రభాస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ వచ్చేయడంతో వారు జోష్‌లో ఉన్నారు.

First Published:  13 Jan 2024 3:43 AM GMT
Next Story