Telugu Global
NEWS

కేఏ పాల్ క్రేజీ డ్యాన్స్

మునుగోడులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ ప్రజలకు మంచి ఎంజాయ్ మెంట్ ఇస్తున్నారు. తాజాగా మునుగోడులో నడి రోడ్డుపై ఓ మాస్ ఫోక్ సాంగ్ కు డ్యాన్స్ చేసి జనాలను ఉర్రూతలూగించారు.

కేఏ పాల్ క్రేజీ డ్యాన్స్
X

మునుగోడు ఉప ఎన్నికలో రకరకాల విన్యాసాలు ప్రజలను రక్తి కట్టిస్తున్నాయి. అందులోనూ కేఏ పాల్ చేసే విన్యాసాలను చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన మాటలు, చేతలు ప్రజలకు మంచి కామెడీని అందిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు.

మునుగోడులో సర్వే చేశానని, తనకు 87 శాతం మంది మద్దతుగా నిలవగా కేసీఆర్ 14 శాతం మందే సపోర్ట్ చేశారని. ఆ 14 శాతం కూడా కేసీఆర్ కు రావడం ఎక్కువేనని ప్రకటించగల ధీమా పాల్ కు కాకుండా మరెవరికుంటుంది? అంతేకాదు.... తాను మునుగోడులో గెలవబోతున్నానని, కాబోయే ముఖ్యమంత్రిని తానేనని అధికారులను హెచ్చరించగల ధైర్యం మరెవరిలోనైనా చూడగలమా ?

అందరిలాగా ఆయన మాటల‌తో సరిపెట్టే మనిషి కాదు. రాజకీయ నాయకులంతా ప్రజలకు అబద్దాలో, నిజాలో చెప్పి ఓట్లడుగుతారు.వాళ్ళ సభల్లో ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ప్రత్యేక కళా బృందాలుంటాయి. ఎవరి పని వాళ్ళు చేస్తారు. కానీ కేఏ పాల్ మాత్రం అందరు రాజకీయ నాయకులవలె కాదు. ప్రజలను ఎంటర్టైన్ చేసేదీ ఆయనే, ఓట్లడిగేదీ ఆయనే.

ఆయన కార్లో కూర్చొని డ్యాన్సులు చేస్తూ ఉంటాడు. సడెన్ గా కారులోంచి కిందికి దూకి నడి రోడ్డు మీద పరిగెడుతుంటాడు. మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్టు ఆగిపోయి అదే రోడ్డు మీద డ్యాన్సు మొదలు పెడతాడు. దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ చేరే ప్రజలకు మాత్రం కొదవ ఉండదు.

అలాగే తాజాగా ఆయన మునుగోడులో ప్రచారం చేస్తూ చేస్తూ సడెన్ గా ఓ దగ్గర ఆగి ఓ మాస్ ఫోక్ సాంగ్ కు స్టెప్పులు వేయడం ప్రారంభించారు. జనం కేరింతలు, విజిల్స్ తో మరింత రెచ్చి పోయాడు. ఆయనే కొరియో గ్రాఫ్ చేసుకున్న డ్యాన్స్ తో చుట్టూ ఉన్న ప్రజలను ఉర్రూతలూగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇలా ఆయన ఏ పని చేసినా సీరియస్ గా చేస్తారు. ఎందుకో జనమే దాన్ని కామెడీగా తీసుకుంటారు.


First Published:  25 Oct 2022 12:06 PM GMT
Next Story