Telugu Global
NEWS

బూమ్ బూమ్ బుమ్రా.. మూడు ఫార్మాట్ల‌లో నంబ‌ర్-1

విశాఖ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన‌ టెస్ట్ మ్యాచ్‌లో 91 ప‌రుగులిచ్చి 9 వికెట్లు తీసిన బుమ్రా ఇప్పుడు టెస్ట్ క్రికెట్ రేటింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు.

బూమ్ బూమ్ బుమ్రా.. మూడు ఫార్మాట్ల‌లో నంబ‌ర్-1
X

టీమిండియా స్పీడ్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా త‌న సంచ‌ల‌న బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌పై రెండో టెస్టు మ్యాచ్‌ల విజ‌యాల్లో కీల‌క‌పాత్ర పోషించాడు. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించాడు. విశాఖ టెస్ట్‌లో సంచలన ప్రదర్శనల నేపథ్యంలో బుమ్రాకు టాప్‌ ర్యాంక్‌ దక్కింది. విశాఖ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన‌ టెస్ట్ మ్యాచ్‌లో 91 ప‌రుగులిచ్చి 9 వికెట్లు తీసిన బుమ్రా ఇప్పుడు టెస్ట్ క్రికెట్ రేటింగ్స్‌లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు.

అశ్విన్‌ను వెన‌క్కినెట్టి..

ఇంగ్లాండ్‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు అశ్విన్ నంబ‌ర్‌వ‌న్ ర్యాంకులో ఉన్నాడు. బుమ్రా 3వ స్థానంలో ఉన్నాడు. విశాఖ టెస్ట్‌ మ్యాచ్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో బుమ్రా అశ్విన్‌ను వెన‌క్కి నెట్టి ఏకంగా నంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకున్నాడు.

మూడు ఫార్మాట్ల‌లోనూ నంబ‌ర్ వ‌న్‌

బుమ్రా టెస్ట్‌ల్లో నంబ‌ర్‌వ‌న్‌గా నిల‌వ‌డంతో ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 2022 జులైలో నంబ‌ర్ వ‌న్ వ‌న్డే బౌల‌ర్‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం ఆరో స్థానంలో కొన‌సాగుతున్నాడు. మ‌రోవైపు పొట్టి ఫార్మాట్ టీ20లోనూ గ‌తంలో నంబ‌ర్ వ‌న్ అయ్యాడు. ఇప్పుడు టెస్ట్‌ల్లో కూడా నంబ‌ర్ వ‌న్ కావ‌డంతో మూడు ఫార్మాట్ల‌లోనూ నంబ‌ర్‌వ‌న్ స్థానాల‌ను సాధించిన తొలి బౌల‌ర్‌గా రికార్డుల‌కెక్కాడు.

First Published:  7 Feb 2024 1:32 PM GMT
Next Story