Telugu Global
International

కాఫీ ధ‌ర ఎక్కువగా ఉందంటూ ప్ర‌పంచ కుబేరుడి భార్య ఫిర్యాదు

అమెరికాలోని సన్ వ్యాలీ రిసార్ట్‌లో అలెన్ అండ్ కో సంస్థ వార్షికోత్సవంలో భాగంగా బిలియనీర్ల కోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌న‌కు హాజరైన ఆస్ట్రిడ్ బఫెట్.. రిసార్ట్ సిబ్బంది ఒక కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.

కాఫీ ధ‌ర ఎక్కువగా ఉందంటూ ప్ర‌పంచ కుబేరుడి భార్య ఫిర్యాదు
X

కాఫీ ధ‌ర ఎక్కువగా ఉందంటూ ప్ర‌పంచ కుబేరుడి భార్య ఫిర్యాదువారెన్ బ‌ఫెట్‌.. ప్ర‌పంచ కుబేరుల్లో ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆస్తుల విలువ 114 బిలియ‌న్ డాల‌ర్లు. మ‌న రూపాయ‌ల్లో 6.35 ల‌క్ష‌ల కోట్లు. ప్ర‌ముఖ పెట్టుబ‌డిదారైన‌ ఆయ‌న చెప్పే వ్యక్తిత్వ వికాసం, మోటివేషన్ పాఠాలను వినేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఆయ‌న గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వ‌చ్చిందంటే.. ఆయ‌న భార్య చేసిన ఓ ఫిర్యాదు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం వ‌ల్ల‌. ఇంత‌కీ ఏంటా ఫిర్యాదు.. ఏ విష‌యంలో అనేది తెలుసుకుందాం..

ఆమె పేరు ఆస్ట్రిడ్ బ‌ఫెట్‌.. వారెన్ బ‌ఫెట్‌కి స‌తీమ‌ణి. అమెరికాలోని సన్ వ్యాలీ రిసార్ట్‌లో అలెన్ అండ్ కో సంస్థ వార్షికోత్సవంలో భాగంగా బిలియనీర్ల కోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్‌న‌కు హాజరైన ఆస్ట్రిడ్ బఫెట్.. రిసార్ట్ సిబ్బంది ఒక కాఫీకి నాలుగు డాలర్లు వసూలు చేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఈ విష‌య‌మై ఆ రిసార్ట్ నిర్వాహ‌కుల‌కు ఫిర్యాదు కూడా చేశార‌ట‌. మిగతా చోట్ల ఆ ధరకు ఒక పౌండ్ కాఫీ (32 టేబుల్ స్పూన్ కాఫీ పొడి) కొనుగోలు చేయొచ్చని ఆ ఫిర్యాదు సంద‌ర్భంగా చెప్పార‌ట‌. అంతేకాదు.. సరసమైన ధరలకు కాఫీ విక్రయించాలని కూడా వారికి సూచించార‌ట‌. అంత‌టి కోటీశ్వ‌రుడి భార్య‌.. ఓ కాఫీ ధ‌ర విష‌యంలో ఫిర్యాదు చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. ఈ విష‌యాన్ని న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.

First Published:  17 July 2023 1:58 PM GMT
Next Story