Telugu Global
International

సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన పీ–8ఏ పొసెడాన్‌ విమానం అమెరికా నౌకాదళంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది.

సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం
X

అమెరికాకు చెందిన ఓ భారీ నిఘా విమానం సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కోస్టు గార్డు సిబ్బంది స్పందించడంతో విమానంలోని సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా నౌకాదళానికి చెందిన ఈ విమానం హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో రన్‌వేపై అదుపుతప్పడంతో ఈ ఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలను ఆ కోర్‌ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్‌ ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన పీ–8ఏ పొసెడాన్‌ విమానం అమెరికా నౌకాదళంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సబ్‌మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయగలదు. టోర్పెడోలు, క్రూజ్‌ క్షిపణులను కూడా ఇది తీసుకెళ్లగలదు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో అక్కడి సిబ్బంది వెల్లడించలేదు. మెరైన్‌ కోర్‌ ప్రధాన స్థావరం కూడా హవాయిలోనే ఉంది. ఇక ప్రపంచంలో ఈ విమానాలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, నార్వే, భారత్‌ సైన్యాలు కూడా వాడుతున్నాయి.


First Published:  21 Nov 2023 6:02 AM GMT
Next Story