Telugu Global
International

ప్రతి 11 నిమిషాలకో మహిళ హత్య : ఐరాస చీఫ్

నవంబర్ 25న జరుపుకోనున్న 'మహిళలపై హింస నిర్మూలన' అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐరాస చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతి 11 నిమిషాలకో మహిళ హత్య : ఐరాస చీఫ్
X

నేడు ప్ర‌తీ చోటా మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌ర‌వ‌వుతోంది. బ‌హిరంగ స‌మాజంలోనే కాదు ముఖ్యంగా స్వంత కుటుంబాల నుంచి కూడా వారికి ర‌క్ష‌ణ‌ ఉండ‌డం లేద‌ని ఐక్యరాజ్య స‌మితి (ఐరాస‌) చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక కుటుంబ సభ్యులు లేదా భాగస్వామి చేతిలో ప్రాణాలు కోల్పోతున్నార‌ని వివరించారు. మానవ హక్కుల ఉల్లంఘనల్లో ఇది అత్యంత దారుణ‌మైనద‌ని అని ఆయ‌న అన్నారు. ప్ర‌భుత్వాలు వెంట‌నే స్పందించి వీటి నివార‌ణ‌కు ఒక కార్యాచ‌ర‌ణ‌ ప్ర‌ణాళిక‌ను రూపొందించుకుని కార్య‌రంగంలోకి దిగాల‌ని గుటెర‌స్ పిలుపునిచ్చారు.

Advertisement

నవంబర్ 25న జరుపుకోనున్న 'మహిళలపై హింస నిర్మూలన' అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐరాస చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. "మహిళలు, బాలికలపై జ‌రుగుతున్న హింస ప్రపంచంలో అత్యంత విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘన. ప్రతి 11 నిమిషాలకు, ఒక మహిళ లేదా బాలిక సన్నిహిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో బ‌లైపోతోంది. కోవిడ్-19 మహమ్మారి నుంచి ఆర్థిక సంక్షోభం వరకు ఇతర ఒత్తిళ్లు అనివార్యమై శారీరక, మాన‌సిక వేధింపుల‌కు దారితీస్తాయని ఆంటోనియో గుటెర్రస్ అన్నారు. అంతేగాక ఆన్‌లైన్ ద్వారా కూడా మ‌హిళ‌లు, బాలిక‌లపై విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు, ఫొటోలు ద్వారా మ‌హిళా సాధికార‌త వ్య‌తిరేక‌ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని అన్నారు.

Next Story