Telugu Global
International

అమెరికా పార్లమెంట్ స్పీకర్ పోటీలో ఒకే ఒక ఓటు సంపాధించి నవ్వుల పాలైన ట్రంప్

పలువురు రిపబ్లికన్లు తమ‌ అభ్యర్థిగా కెవిన్ మెక్‌కార్తీని నిలబెట్టినప్పటికీ ఆ పార్టీకి చెందిన కొన్ని వర్గాలు ఆయనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెక్‌కార్తీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు మాట్ గేట్జ్ స్పీకర్ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రతిపాదించాడు.

అమెరికా పార్లమెంట్ స్పీకర్ పోటీలో ఒకే ఒక ఓటు సంపాధించి నవ్వుల పాలైన ట్రంప్
X

కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేందుకు యునైటెడ్ స్టేట్స్ పార్లమెంట్ ఫెయిల్ అవుతూ వస్తోంది. ఆ దేశ పార్లమెంటు చరిత్రలోనే ఇలా జరగడం 100 ఏళ్ళ తర్వాత ఇది మొదటి సారి. ఎన్ని రౌండ్లు ఎన్నికలు జరిగినా ఎవరికీ మెజార్టీ రావడం లేదు.

పలువురు రిపబ్లికన్లు తమ‌ అభ్యర్థిగా కెవిన్ మెక్‌కార్తీని నిలబెట్టినప్పటికీ ఆ పార్టీకి చెందిన కొన్ని వర్గాలు ఆయనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెక్‌కార్తీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు మాట్ గేట్జ్ స్పీకర్ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రతిపాదించాడు. స్పీకర్ గా కాంగ్రెస్ లో సభ్యులు కాని వారు కూడా పోటీపడవచ్చు. అయితే మొత్తం 430 ఓట్లలో ట్రంంప్ కు ఒకే ఒక ఓటు రావడం తో పార్లమెంటు మొత్తం గొల్లున నవ్వింది.

అమెరికన్ జర్నలిస్ట్ ఆరోన్ రూపర్ షేర్ చేసిన వీడియోలో, హౌస్ క్లర్క్ చెరిల్ జాన్సన్ 11వ రౌండ్ ఓట్లను చదివి వినిపించారు. "ఫ్లోరిడాకు చెందిన గౌరవనీయులైన డొనాల్డ్ జె ట్రంప్‌కు ఒక ఓటు లభించింది," అని ఆమె చెప్పగానే నవ్వుల హోరు వినిపించింది.

అమెరికా కాంగ్రెస్ స్పీకర్ ఎన్నిక ఇంత క్లిష్టమవడం 100 ఏళ్ళ తర్వాత ఇదే మొదటి సారి. గతంలో 1923 లో మసాచుసెట్స్ కు చెందిన రిపబ్లికన్ అభ్యర్థి ఫ్రెడరిక్ గిల్లెట్ 9 రౌండ్ల ఓటింగ్ తర్వాత స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఈ సారి 11 రౌండ్లయినప్పటికీ ఇప్పటికీ స్పీకర్ ఎన్నిక తేలలేదు.

First Published:  7 Jan 2023 10:48 AM GMT
Next Story