Telugu Global
International

కైలాసాన్ని గుర్తించిన అమెరికా..

నెవార్క్ సిటీ మేయర్ తో, నిత్యానంద శిష్య పరమాణుల్లో ఒకరైన భక్తురాలు, కైలాస దేశ ప్రతినిధిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ పత్రాలపై సంతకం చేస్తున్న ఫొటోలను నిత్యానంద సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కైలాసాన్ని గుర్తించిన అమెరికా..
X

అదేంటి అమెరికా, కైలాసాన్ని గుర్తించడమేంటి అనుకుంటున్నారా..? అవును, కైలాసాన్ని గుర్తించడమే కాదు, కైలాస రాజ్యంతో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కైలాసానికి ప్రత్యేక దేశం అనే హోదాని కూడా ఇచ్చింది. ఈ కైలాస దేశానికి అధిపతిని అని చెప్పుకుంటున్న నిత్యానంద.. అమెరికా తమను గుర్తించిందంటూ చంకలు గుద్దుకుంటున్నారు. ఆ ఒప్పందాలు ఇవిగో అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు.

నిత్యానంద ఇండియాలో కనపడితే పట్టుకుని జైల్లో వేస్తారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి 50సార్లు కోర్టు మెట్లెక్కిన ఆయన.. 2019 చివర్లో భారత్ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత ఈక్వెడార్ సమీపంలో ఓ ద్వీపం కొనుగోలు చేసుకుని దానికి కైలాసం అనే పేరు పెట్టుకున్నాడు. అక్కడే తన భక్తజనాన్ని పోగు చేసుకుని ఓ ప్రైవేట్ సామ్రాజ్యం సృష్టించుకున్నాడు. అక్కడినుంచి ఆయన చేసే కార్యకలాపాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు భక్తులకు టచ్ లో ఉంటున్నాడు నిత్యానంద. తన ద్వీపాన్ని, దానికి అధిపతిగా తనను గుర్తించాలంటూ ఆమధ్య ఐక్యరాజ్యసమితికి కూడా లేఖ రాశాడు. అయితే ఐక్యరాజ్య సమితి ఇంకా స్పందించలేదు. ఈలోగా అమెరికాలోని న్యూజెర్సీరాష్ట్రంలో ఉన్న నెవార్క్ సిటీతో కైలాసాధిపతిగా నిత్యానంద ఓ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.


నెవార్క్ సిటీ మేయర్ తో, నిత్యానంద శిష్య పరమాణుల్లో ఒకరైన భక్తురాలు, కైలాస దేశ ప్రతినిధిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరూ పత్రాలపై సంతకం చేస్తున్న ఫొటోలను నిత్యానంద సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రొటోకాల్ ద్వైపాక్షిక ఒప్పందంగా దీన్ని పేర్కొన్నారు నిత్యానంద. ఇప్పుడు నెవార్క్ సిటీ ఒప్పందాన్ని ఆయన హైలెట్ చేయాలనుకుంటున్నారు. అమెరికా కూడా తమను గుర్తించిందంటున్నారు. ఐక్యరాజ్య సమితి తన ద్వీపానికి గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తమ్మీద భారత్ లో ఉంటూ కోర్టుల చుట్టూ తిరిగిన ఓ మాయగాడు, కేటుగాడు ఇప్పుడు ఓ సామ్రాజ్యం సృష్టించుకుని, దానికి తానే అధిపతి అని చెప్పుకుంటూ, ప్రపంచ గుర్తింపుకోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయన మూఢ భక్తులు ఇంకా ఇక్కడ ఆయన పేరుతో పూజలు చేస్తుండటం గమనార్హం. జనవరి 3 నుంచి 10వ తేదీ వరకు నిత్యానంద 46వ అవతార దినోత్సవం తిరువన్నామలై క్రివాలాబతిలోని కైలాస రాయబార కార్యాలయంలో ఉన్న నిత్యానంద ఆశ్రమంలో జరిగాయి.

First Published:  13 Jan 2023 5:17 PM GMT
Next Story