Telugu Global
International

40 వేల కార్లను రీకాల్ చేసిన ఎలన్ మస్క్..

ఐదేళ్ల కాలంలో అమ్ముడైన టెస్లా ఎస్, ఎక్స్ సిరీస్‌లలో కొన్ని లోపాలు బయటపడ్డాయి. ఎగుడు దిగుడు రోడ్లపై వెళ్లేటప్పుడు, గతుకుల్లో నుంచి కారు పైకి లేచేటప్పుడు పవర్ స్టీరింగ్ సరిగా పనిచేయడం లేదని కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.

40 వేల కార్లను రీకాల్ చేసిన ఎలన్ మస్క్..
X

ఎలన్ మస్క్ కార్ల కంపెనీ టెస్లా 40 వేల కార్లను రీకాల్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 2017 నుంచి 2021 మధ్య తయారైన ఎస్, ఎక్స్ మోడల్ ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. పవర్ స్టీరింగ్ విషయంలో కొన్ని సమస్యలున్నాయని, వాటిని సరిచేసి పంపిస్తామని కస్టమర్లకు తెలిపింది టెస్లా. అయితే ఈ రీకాల్ కేవలం అమెరికాలోని కార్లకు మాత్రమే.

చేతులు కాలాక..

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ప్రపంచవ్యాప్తంగా టెస్లాకి మంచి పేరుంది. అయితే ఇప్పుడు ఈ కార్ల విషయంలో కూడా కాంపిటీషన్ పెరిగింది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్ల తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు చూస్తున్నాయి. ఆయా కంపెనీలన్నీ పోటీకి వచ్చేసరికి టెస్లా రేట్లు కూడా భారీగా తగ్గించాల్సి వచ్చింది. అదే సమయంలో కార్ల నాణ్యత ప్రమాణాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది టెస్లా. ఐదేళ్ల కాలంలో అమ్ముడైన టెస్లా ఎస్, ఎక్స్ సిరీస్‌లలో కొన్ని లోపాలు బయటపడ్డాయి. ఎగుడు దిగుడు రోడ్లపై వెళ్లేటప్పుడు, గతుకుల్లో నుంచి కారు పైకి లేచేటప్పుడు పవర్ స్టీరింగ్ సరిగా పనిచేయడం లేదని కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే చాలాకాలం దీన్ని సర్దబాటు చేస్తూ వచ్చిన కంపెనీ ఎట్టకేలకు వాటన్నిటినీ రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది.

అక్టోబర్ 11 నుంచి సాఫ్ట్‌వేర్ అప్డేట్ కూడా ప్రకటించింది టెస్లా. ఈ సాఫ్ట్‌వేర్‌తో లోపాలను సవరించబోతున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకూ అమెరికాలో 314 కంప్లయింట్లు వచ్చాయి. అయితే ఎక్కడా ప్రమాదాలు జరిగినట్టు కానీ, ప్రాణాపాయం జరిగినట్టు కానీ రికార్డుల్లో నమోదు కాలేదని చెబుతున్నారు టెస్లా ప్రతినిధులు. ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడా కార్లను రీకాల్ చేస్తున్నట్టు తెలిపారు.

First Published:  9 Nov 2022 8:12 AM GMT
Next Story