Telugu Global
International

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో 'RRR' చిత్రానికి గానూ SS రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు

SS రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. RRR చిత్రానికి గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో RRR చిత్రానికి గానూ  SS రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు
X

టాలీవుడ్ దర్శకుడు SS రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. RRR చిత్రానికి గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ఈ అవార్డు అందుకున్న తర్వాత రాజమౌళి దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న చిత్రానికి ఈ అవార్డు ఇచ్చినందుకు NYFCC కి కృతజ్ఞతలు తెలిపారు "మీ నుండి ఈ అవార్డును అందుకోవడం గొప్ప గౌరవం. మీరు నా మొత్తం RRR లోని నటీనటులు, సిబ్బందిని సత్కరించారు. అని అన్నారు

చాలా మందికి ఈ మూవీ ఉందనే విషయమే తెలియదు. అయితే ఇప్పుడు చాలా మంది దీనిని చూస్తారని నేను నమ్ముతున్నాను" అని రాజమౌళి తన ప్రసంగంలో అన్నారు.


First Published:  5 Jan 2023 11:59 AM GMT
Next Story