Telugu Global
International

షాకింగ్ రిపోర్ట్ :భూకంపం ధాటికి ఆ దేశం 5 మీటర్లు పక్కకు జరిగిపోయింది

ప్రొఫెసర్ కార్లో డగ్లియాని ఇటలీ 24తో మాట్లాడుతూ, టర్కీ భూభాగం కింద ఉన్న అనతోలియా, అరేబియా, యూరోషియా, ఆఫ్రికా భూఫలకాలు నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొనడం తో 7.8, 7.2 తీవ్రతతో వరుసగా రెండుసార్లు శక్తిమంతమైన భూకంపాలు సంభవించినట్లు ఆయన తెలిపారు.

షాకింగ్ రిపోర్ట్ :భూకంపం ధాటికి ఆ దేశం 5 మీటర్లు పక్కకు జరిగిపోయింది
X

సోమవారం టర్కీలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలు ఆ భూమి కింద ఉన్న‌ టెక్టోనిక్ ప్లేట్ లు (భూమి పై పొరల్లోని ఫలకాలు) ఆదేశాన్ని 5 మీటర్ల మేరకు పక్కకు తీసుకెళ్ళాయి. అని ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని స్థానిక వార్తా సంస్థతో మాట్లాడుతూ, టర్కీ పశ్చిమం వైపు ఐదు నుండి ఆరు మీటర్లు పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పారు. టర్కీ, సిరియా రెండింటిలోనూ సంభవించిన ఈ భూకంపం కారణంగా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. 15,000 మందికి పైగా మరణించారు. సోమవారం నాటి అతి పెద్ద భూకంపం తర్వాత ఆ రెండు దేశాల్లో ఇంకా అనేక భూప్రకంపనాలు వస్తూనే ఉన్నాయి.

ప్రొఫెసర్ కార్లో డగ్లియాని ఇటలీ 24తో మాట్లాడుతూ, టర్కీ భూభాగం కింద ఉన్న అనతోలియా, అరేబియా, యూరోషియా, ఆఫ్రికా భూఫలకాలు నిరంతరం ఒకదానితో ఒకటి ఢీకొనడం తో 7.8, 7.2 తీవ్రతతో వరుసగా రెండుసార్లు శక్తిమంతమైన భూకంపాలు సంభవించినట్లు ఆయన తెలిపారు.

అయితే, ఇటలీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కానాలజీ (ఇంగ్వీ) ప్రెసిడెంట్, ఇదంతా ప్రారంభ డేటాపై ఆధారపడి ఉందని, రాబోయే రోజుల్లో ఉపగ్రహాల నుండి మరింత ఖచ్చితమైన సమాచారం వస్తే మరింత వివరంగా తెలుస్తుందని అన్నారు.

భూకంప ప్రభావిత ప్రాంతంలోని మార్పుల గురించి ప్రొఫెసర్ డోగ్లియోని మాట్లాడుతూ, "190 కిలోమీటర్ల పొడవు, 25 కిలోమీటర్ల వెడల్పుతో భారీ పగుళ్లు ఏర్పడి, భూమిని భారీ ఎత్తున కదిలించాయని, అందువల్లే తొమ్మిది గంటల వ్యవధిలో రెండు అత్యంత తీవ్రమైనభూకంపాలు వచ్చాయని, వాస్తవానికి భూమి ఇప్పటికీ కంపిస్తూనే ఉంది అని చెప్పారు.

ఇక భూకంప కారణంగా ఇప్పటి వరకు 15వేలకు పైగా ప్రజలు మరణించినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకొని ఎంత మంది ఉన్నారన్నది లెక్కలేదు. ఇప్పటికే భూకంప వచ్చి నాలుగు రోజులైనందువల్ల శిథిలాల కింద ఉన్న వారు బతికి ఉండే అవకాశంలేదని నిపుణులు చెప్తున్నారు. ఎక్కడ భూకంపం వచ్చినా బయటపడిన వారిలో 90 శాతం మంది మొదటి మూడు రోజుల్లోనే రక్షించబడ్డారని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లోని విపత్తులు, ఆరోగ్య ప్రొఫెసర్ ఇలాన్ కెల్మాన్ చెప్పారు. మూడు రోజుల తర్వాత బతకడం కష్టమని ఆయన చెప్పారు.

"సాధారణంగా, భూకంపాలు ప్రజలను చంపవు, కుప్పకూలిన బిల్డింగులే ప్రజలను చంపుతాయి" అని కెల్మాన్ అన్నారు.

First Published:  9 Feb 2023 12:53 PM GMT
Next Story