Telugu Global
International

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్‌కు వ్యతిరేకంగా యుఎస్ 'గేమ్ ప్లాన్' సిద్ధం !

పుతిన్ ఒక వేళ ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించాలని నిర్ణయించుకుంటే అమెరికా గేమ్ ప్లాన్ తో సిద్ధంగానే ఉంద‌ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చ‌రించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో, రష్యా గ్యాస్ ఎగుమతులపై అదనపు ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం: పుతిన్‌కు వ్యతిరేకంగా యుఎస్ గేమ్ ప్లాన్ సిద్ధం !
X

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, నాలుగు ఉక్రేనియన్ భూభాగాలను విలీనం చేసున్న‌ట్టు ఒప్పందాలపై సంతకం చేసిన తర్వాత, రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. కాగా. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించాలని నిర్ణయించుకుంటే అమెరికా "గేమ్ ప్లాన్" తో సిద్ధంగానే ఉంద‌ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చ‌రించారు. ఉ క్రెయిన్ పై ర‌ష్యా వైమానిక దాడులను బిడెన్ ఖండించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో, రష్యా గ్యాస్ ఎగుమతులపై అదనపు ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.

ఉక్రెయిన్ న‌గ‌రాల‌పై భీక‌ర క్షిప‌ణి దాడులు చేస్తూ భ‌యోత్పాతం సృష్టించ‌డంతో ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాను "టెర్రర్ కంట్రీ"గా పేర్కొన్న విష‌యం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌పై పదేపదే వైమానిక దాడులకు పాల్స‌డుతోంది ర‌ష్యా. కైవ్‌లో 84 క్షిపణులు దాడులు జ‌రిగాయ‌ని స్థానిక మీడియా పేర్కొన్నది.

రష్యా ఆక్రమిత జపోరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిప్యూటీ హెడ్‌ని రష్యా కిడ్నాప్ చేసిందని, ఆయనను తెలియని ప్రదేశంలో ఉంచారని ఉక్రెయిన్ ఆరోపించింది.

తాజాగా, దేశ రాజ‌ధాని కీవ్ లోని పౌరులు తమ దేశంపై అణు దాడి జ‌రుగవ‌చ్చ‌ని భయపడుతున్నారు. ఈ దాడి నుంచి త‌ప్పించుకునేందుకు సుర‌క్షిత‌మైన బంక‌ర్ల కోసం స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

ఉక్రెయిన్‌లో పదే పదే జరిగిన బాంబు పేలుళ్ల కారణంగా దేశంలోని భారతీయ విద్యార్థులు తమను స్వ‌దేశానికి తీసుకెళ్ళాల‌ని మ‌రో సారి భార‌త ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. విద్యార్థులందరినీ తిరిగి తీసుకురావడానికి భారతదేశం ఇంతకుముందు సామూహిక తరలింపు ఆపరేషన్‌ను నిర్వహించింది. అయితే వారిలో కొందరు తమ చదువులను పూర్తి చేయడానికి అక్క‌డే ఉండిపోయారు.

First Published:  13 Oct 2022 5:36 AM GMT
Next Story