Telugu Global
International

"ఉక్రెయిన్ న‌గ‌రాల‌పై క్షిపణి దాడుల‌తో విరుచుకుప‌డ్డ ర‌ష్యా..భీతావ‌హ ప‌రిస్థితులు

ఉక్రెయిన్ పై రష్యా మళ్ళీ దాడి తీవ్రతరం చేసింది. క్రిమియా వంతెనను ఉక్రెయిన్ దళాలు కూల్చివేయడంతో ఆగ్రహం మీద ఉన్న రష్యా, ఉక్రెయిన్ లోని ప‌లు న‌గ‌రాలపై క్షిపణులు దాడులు చేస్తోంది.

ఉక్రెయిన్ న‌గ‌రాల‌పై క్షిపణి దాడుల‌తో విరుచుకుప‌డ్డ ర‌ష్యా..భీతావ‌హ ప‌రిస్థితులు
X

ఉక్రెయిన్ లోని ప‌లు న‌గ‌రాలపై ర‌ష్యా క్షిపణులు భీక‌ర దాడులతో విరుచుకుప‌డ‌డంతో భీతావ‌హ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌లు న‌గ‌రాలు ఈ దాడుల‌తో ద‌ద్ద‌రిల్లుతున్నాయి. ప‌లువురు మ‌ర‌ణించిన‌ట్టు, అనేక‌మంది గాయ‌ప‌డిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌ధాని కీవ్ స‌హా ప‌లు న‌గ‌రాల‌పై ర‌ష్యా ఏక‌కాలంలో దాడులు చేస్తోంద‌ని, ఉక్రెయిన్ అద్య‌క్షుడు జెలెన్స్కీ కార్యాల‌యంపైనా కూడా క్షిప‌ణి దాడి జ‌రిగిందని వార్త‌లు పేర్కొన్నాయి.

క్రిమియా వంతెన పేలుడు జ‌రిగిన ఒక రోజు త‌ర్వాత ర‌ష్యా ఈ దాడుల‌కు పాల్ప‌డ‌డం గ‌మ‌నార్హం. సోమవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయ‌నిఉక్రెయిన్ ప్రెసిడెన్సీ తెలిపింది.

భీక‌ర దాడుల నేప‌ద్యంలో ప్ర‌జలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివవెళ్ళి త‌ల‌దాచుకోవాల‌ని ప్రెసిడెంట్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ కైరిలో టిమోషెంకో సోషల్ మీడియాలో విజ్ఞ‌ప్తి చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:15 గంటలకు కీవ్ లో పేలుళ్ళు జ‌రిగాయ‌ని, అనంత‌రం ఆప్రాంతంలో అనేక అంబులెన్సులు క‌నిపించాయ‌ని ఓ వార్తా సంస్త ప్ర‌తినిధి తెలిపారు.

" కాగా క్రిమియా వంతెన ధ్వంసానికి నేరస్థులు, స్పాన్సర్‌లు ఉక్రేనియన్ సీక్రెట్ ఏజెన్సీలే కార‌ణం " అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రిమియా బ్రిడ్జ్ బాంబు దాడి గురించి స్పందివ‌స్తూ దీనిని "ఉగ్రవాద చర్య"గా అభివర్ణించాడు.

బాంబు దాడిని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఇన్వెస్టిగేషన్ కమిటీ చీఫ్‌తో జరిగిన సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడినట్లు రష్యా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పుతిన్ సోమవారం సాయంత్రం భద్రతా మండలితో సమావేశానికి సిద్ధమవుతున్నారని క్రెమ్లిన్ స్థానిక వార్తా సంస్థలకు తెలిపింది.

First Published:  10 Oct 2022 9:36 AM GMT
Next Story