Telugu Global
International

ఏడేళ్ల కుర్రాడి వేలు కట్ చేసిన రోబో

రోబోల వల్ల మానవజాతికి ప్రమాదమని కొందరు, కాదు ఉపయోగమని కొందరు.... ఇలా వాదనలు నడుస్తూండగానే రోబోల తయారీ మాత్రం ఆగటం లేదు. ఒక్కో సారి వాటి వల్ల ప్రమాదాలు కూడా తప్పడం లేదు.

ఏడేళ్ల కుర్రాడి వేలు కట్ చేసిన రోబో
X

రోబోలతో ఆటలంటే చేటు తెచుకున్నట్టే.. అవి కూడా హింస'కు పాల్పడతాయంటే నమ్మలేం..కానీ జరిగిన ఓ ఘటన చూస్తే అది నిజమేనని నమ్మాల్సి వస్తుంది. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఓ విచిత్రమైన ఈ సంఘటన ఆశ్చర్యంగానే కాక ఆందోళన కలిగించేదిగా కూడా ఉంది. ఈ నెల 19 న ఇక్కడ నిర్వహించిన చెస్ ఓపెన్ టోర్న మెంట్ లో రోబోతో చెస్ ఆడుతున్న ఏడేళ్ల కుర్రాడి వేలును ఆ రోబో కట్ చేసేసింది. ఇందుకు కారణం.. అది తన పావును గడి నుంచి తీయకముందే ఆ కుర్రాడు ఏ మాత్రం వెయిట్ చేయకుండా తన పావును కదిపేందుకు యత్నించడమే. ఈ క్రమంలో ఇతడి వేలు రోబో చేతిలో చిక్కుకుపోయింది. . ఇది చూసినవెంటనే దగ్గరున్నవారు పరుగెత్తుకుని వచ్చి అతి కష్టం మీద రోబో నుంచి కుర్రాడిని రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాపం .. ఈ బాలుడి వేలు ఫ్రాక్చర్ కాగా .. వీరంతా తక్షణమే ఆసుపత్రికి తీసుకువెళ్లి వేలికి కట్లు వేయించారు. ఈ బాలుడ్ని క్రిస్టోఫర్ గా గుర్తించారు. అయితే ఇతడేమీ చెస్ లో సాదాసీదా ప్లేయర్ కాదు. మాస్కోలో తొమ్మిదేళ్ల వయస్సువరకు గల 30 మంది చెస్ ప్లేయర్లలో ఒకడు కూడా.. జరిగిన సంఘటనపై చెస్ ఫెడరేషన్ ఆఫ్ రష్యా వైస్ ప్రెసిడెంట్ సెర్జీ స్మాగిన్ మాట్లాడుతూ ..ఆధునిక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి హానికరంగా పరిణమిస్తుందన్న అభిప్రాయాలు తప్పని, క్రిస్టోఫర్ సేఫ్టీ ప్రొటొకాల్స్ ని అతిక్రమించాడని చెప్పారు. అతని తొందరబాటే అతనికి చేటు తెచ్చిందన్నారు. ఏమైనా ఇది అత్యంత అరుదైన కేసని, తన స్మృతుల్లో ఇది మొదటిదని ఆయన వ్యాఖ్యానించాడు. ఈ ఏడేళ్ల బాలుడికి కలిగిన గాయం సీరియస్ ఏమీ కాదని, తన వేలితో చెస్ ఆడగలడని ఆయన అన్నాడు. పైగా అవార్డుల సెరిమనీకి హాజరు కాగలడని, డాక్యుమెంట్లపై సంతకాలు కూడా చేయగలడని సెర్జీ స్మాగన్ చెప్పారు. క్రిస్టోఫర్ కి అయిన గాయం త్వరగా మానేందుకు ఇతని వేలికి డాక్టర్లు ప్లాస్టర్ పేస్ట్ చికిత్స సైతం చేశారన్నారు.

ఏది ఏమైనా క్రిస్టోఫర్ పేరెంట్స్ మాత్రం జరిగిన ఘటనపై తీవ్ర ఆందోళన చెందారు. వారు చెస్ ఫెడరేషన్ ఆఫ్ మాస్కోపై ప్రాసిక్యూటర్ల కార్యాలయాన్ని సంప్రదించాలని నిర్ణయించారు. అయితే ఫెడరేషన్ అధికారులు.. ఈ సమస్యను తామే పరిష్కరిస్తామని, తమ చేతనైనంతవరకు సాయపడేందుకు యత్నిస్తామని వారికి హామీ ఇచ్చారు . అంటే అవసరమైతే ఈ బాలుడి కుటుంబానికి పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని పరోక్షంగా పేర్కొన్నారు.

అయితే హ్యుమానాయిడ్ రోబోలు హింసాత్మకంగా మారి మానవాళికి ముప్పుగా పరిణమిస్తాయా అన్న దానిపై విస్తృత స్టడీ చేపట్టాల్సి ఉందంటున్నారు. రోబోల్లో యాంత్రికపరమైన (మెకానికల్) స్ట్రెంత్ ఉంటుంది. ఒక ప్లాన్ అంటూ లేని రోబోల కదలికల కారణంగా యాక్సిడెంటల్ గా మనుషులకు ప్రమాదం కలిగే అవకాశాలున్నాయి. ఒక్కో సందర్భంలో రోబోల కారణంగా వ్యక్తులు తీవ్ర గాయాలకు కూడా గురి కావచ్చు. అమెరికాలో లోగడ జరిగిన ఓ ఘటనను ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఓ వర్క్ షాప్ లో ఒక వ్యక్తి రోబోలతో కూడిన న్యూరాల్ ఇంటర్ ఫేస్ లో పని చేస్తుండగా పొరపాటుగా హఠాత్తుగా రోబో ఒకటి అతని చేతిపై 'దాడి' చేసింది. కంట్రోల్ లేని రోబో కారణంగా అతగాడు గాయపడ్డాడు. హ్యూమనాయిడ్ రోబోల బ్రెయిన్ కి కంప్యూటర్ ఇంటర్ ఫేస్ పై కంట్రోల్ లేకపోతే ఈ విధమైన ఘటనలు జరుగుతుంటాయట. ఏది ఏమైనా' అన్ స్టేబుల్ కిల్లర్స్ ఆర్ థింగ్ ఆఫ్ ది పాస్ట్' అంటున్నవారు కూడా 'స్టిల్ పర్సిస్ట్ థ్రెట్' అని హెచ్చరిస్తున్నారు.






First Published:  25 July 2022 10:46 AM GMT
Next Story