Telugu Global
International

రిషి సునాక్‌కు లైన్ క్లియర్.. ప్రధాని రేసు నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్

దేశ అవసరాలు, కన్జర్వేటీవ్ పార్టీ ఐక్యత కోసం పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బోరిస్ వెల్లడించారు.

రిషి సునాక్‌కు లైన్ క్లియర్.. ప్రధాని రేసు నుంచి తప్పుకున్న బోరిస్ జాన్సన్
X

బ్రిటన్ నెక్ట్స్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక కావడానికి మార్గం సుగమమం అవుతోంది. తాను బరిలో ఉంటానని రిషి సునాక్ ఆదివారమే అధికారికంగా ప్రకటించారు. అయితే అతడికి పోటీగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ బరిలో ఉంటారని పలువురు అంచనా వేశారు. లిజ్ ట్రస్ రాజీనామా అనంతరం తాను కూడా కేసులో ఉంటానని చెప్పుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బోరిస్ జాన్సన్ ప్రకటించారు. తనకు ప్రధాని అవడానికి తగినంత మంది మద్దతు ఉన్నది. కానీ దేశ అవసరాలు, కన్జర్వేటీవ్ పార్టీ ఐక్యత కోసం పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బోరిస్ వెల్లడించారు.

కరేబియన్ దీవుల్లో వెకేషన్ పూర్తి చేసుకొని లండన్ వచ్చిన జాన్సన్.. ఇవ్వాళ జరుగనున్న పోటీలో తనకు 100 మంది ఎంపీల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించారు. తనకు 102 మంది మద్దతు ఉందని కూడా ప్రకటించుకున్నారు. కానీ, చివరకు పోటీ నుంచి విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే బరిలో ఉన్న రిషి సునాక్‌తో గానీ.. పెన్నీ మోర్డాంట్‌తో గానీ ఆయన చర్చలు జరపలేదు. వారిద్దరిలో ఒకరిని బరిలో నుంచి తప్పుకోమని నచ్చజెప్పలేక పోయారు. దీంతో ప్రధాని పదవి కోసం ఎన్నిక అనివార్యం కానున్నది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రిషి సునాక్‌కే ఎక్కువ మంది ఎంపీల మద్దతు ఉన్నది. బోరిస్ జాన్సన్ బరిలో ఉంటే సునాక్‌కు కొంచెం ఇబ్బంది ఎదురయ్యేది. కానీ ఆయన తప్పుకోవడంతో సునాక్‌కు లైన్ క్లియర్ అయినట్లే. బోరిస్ తెరవెనుక ప్రయత్నాలు ఏవీ చేయకపోతే సునాక్ సులభంగానే టోరీ నాయకుడిగా ఎన్నికవుతాడని, ఆయన ప్రధాని చేపట్టడం ఖాయమని చెబుతున్నారు. సోమవారం జరిగే జరిగే ఓటింగ్ ద్వారా ప్రధాని పదవికి ఎవరు ఎన్నికవుతారో తెలిసిపోతోంది.

First Published:  24 Oct 2022 5:25 AM GMT
Next Story