Telugu Global
International

ఫుట్ బాల్ వరల్డ్ కప్:మొరాకో చేతిలో ఓటమితో బెల్జియంలో చెలరేగిన హింస‌

ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియం, 22వ ర్యాంకర్‌ మొరాకో చేతిలో 2-0తో ఓడిపోవడం బెల్జియం ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వగా, మొరాకో అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలోప్ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఆదివారం నాడు అల్లర్లు చెలరేగాయి.

ఫుట్ బాల్ వరల్డ్ కప్:మొరాకో చేతిలో ఓటమితో బెల్జియంలో చెలరేగిన హింస‌
X

కతార్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచుల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ‌ జట్లు ఓడిపోవడం, ఏ మాత్రం పోటీ ఇవ్వలేవ‌నుకున్న జట్లు గెలవడం కొందరు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి.

ఫేవరెట్‌లలో ఒకటిగా బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియం, 22వ ర్యాంకర్‌ మొరాకో చేతిలో 2-0తో ఓడిపోవడం బెల్జియం ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వగా, మొరాకో అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలోప్ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఆదివారం నాడు అల్లర్లు చెలరేగాయి. పోలీసు లాఠీ చార్జ్ లు, నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగం చేసేంతగా పరిస్థితి విషమించింది.

బెల్జియంలో దాదాపు 5 లక్షలకు పైగా మొరాకో వాసులు నివసిస్తున్నారు. మ్యాచ్ లో బెల్జియంపై మోరాకో విజయం సాధించగానే మొరాకో అభిమానులు వేలాది మంది మొరాకో జెండాలతో రోడ్లమీదికి వచ్చారు. బాణా సంచా పేల్చి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అసలే ఓటమి భాధతో నిరాశలో ఉన్న బెల్జియం ఫ్యాన్స్ కు మొరాకో వాసుల ఆనందోత్షాలు పుండుమీద కారం చల్లినట్టయ్యాయి. దాంతో బెల్జియం ఫ్యాన్స్ కూడా వేలాదిగా రోడ్లెక్కారు. కర్రలు, ఫైర్ మెటీరియల్ తో వాళ్ళు భీభత్సం సృష్టించారు. షాప్స్ పై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. హైవేపై వస్తువులకు నిప్పంటించారు.

నడిరోడ్లపై పలు వాహనాలను తగలబెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపు చేసేందుకు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి.

అల్లర్ల నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా మెట్రో స్టేషన్లను మూసివేశారు. అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు పాకకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. అలాగే, బెల్జియం తూర్పు నగరమైన లీగ్‌లో 50 మంది ముఠా పోలీస్ స్టేషన్‌పై దాడి చేసింది. అద్దాలను పగలగొట్టి.. రెండు పోలీసు వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో పోలీసులు వాటర్ కేనన్లు ఉపయోగించి వారిని చెదరగొట్టారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

"సాయంత్రం 7 గంటలకు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అయినప్పటికీ తమ గస్తీ కొనసాగుతుంది. " అని పోలీసు ప్రతినిధి ఇల్సే వాన్ డి కీరే చెప్పారు.



First Published:  28 Nov 2022 7:31 AM GMT
Next Story