Telugu Global
International

ఓటమిని తట్టుకోలేకపోతున్న ఫ్రాన్స్ ఫుట్ బాల్ ఫ్యాన్స్...చెలరేగిన ఘర్షణలు

ఖతార్‌లో పెనాల్టీ షాట్స్ లో ఫ్రాన్స్ 4-2తో అర్జెంటీనా చేతిలో ఓడిపోగానే వేలాది మంది ఫుట్‌బాల్ అభిమానులు పారిస్, నైస్ ,లియోన్ నగరాల్లో వీధుల్లోకి వచ్చారు. పోలీసు సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వేలాదిగా రొడ్డెకిన ఫ్యాన్స్ ను ఆపడం వారి తరం కాలేదు. పోలీసులపై రాళ్లు రువ్వారు, బాణసంచా కాల్చారు.

ఓటమిని తట్టుకోలేకపోతున్న ఫ్రాన్స్ ఫుట్ బాల్ ఫ్యాన్స్...చెలరేగిన ఘర్షణలు
X

ఆదివారం జరిగిన ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్ లో ఫ్రాన్స్ ఓడిపోవడంతో ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగాయి. ప్రపంచకప్ ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడంతో తట్టుకోలేని ఫ్రాన్స్ ఫ్యాన్స్ అనేక ఫ్రెంచ్ నగరాల్లో అల్లర్లకు పాల్పడ్డారు.

ఖతార్‌లో పెనాల్టీ షాట్స్ లో ఫ్రాన్స్ 4-2తో అర్జెంటీనా చేతిలో ఓడిపోగానే వేలాది మంది ఫుట్‌బాల్ అభిమానులు పారిస్, నైస్ ,లియోన్ నగరాల్లో వీధుల్లోకి వచ్చారు.

పోలీసు సిబ్బంది వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వేలాదిగా రొడ్డెకిన ఫ్యాన్స్ ను ఆపడం వారి తరం కాలేదు. పోలీసులపై రాళ్లు రువ్వారు, బాణసంచా కాల్చారు. "లియాన్‌లో, అల్లర్లను‍ండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై దాడి జరిగింది" అని ఓ ట్విట్తర్ యూజర్ పోస్ట్ చేశారు.

ఫ్రెంచ్ రాజధానిలోని ప్రసిద్ధ చాంప్స్-ఎలీసీస్‌లో పోలీసులతో ఫ్రాన్స్ ఫుట్ ఫ్యాన్స్ ఘర్షణ పడ్డారు. అనేక చోట్ల ఫ్యాన్స్ రోడ్డుపై కనిపించిన వస్తువులకు, వాహనాలకు నిప్పు పెట్టారు. వాహనాలపై దాడులకు దిగారు.పోలీసులు పారిస్ వీధుల్లో టియర్ గ్యాస్ వదిలారు. నివేదికల ప్రకారం, ప్యారిస్ నగరంలో పదుల సంఖ్యలో అరెస్టులు జరిగాయి.


First Published:  19 Dec 2022 6:44 AM GMT
Next Story