Telugu Global
International

వైద్య‌సాయం చేసి కాపాడండి..!

నిత్యానంద నుంచి లేఖ వచ్చిన విషయాన్ని శ్రీలంక ఉన్నతాధికారులు ధృవీకరించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నాను.. వైద్య సదుపాయాలు లేవు కాబట్టి తనకు ఆశ్రయం ఇవ్వాలంటూ నిత్యానంద లేఖ రాశారని వెల్లడించారు.

వైద్య‌సాయం చేసి కాపాడండి..!
X

వివాదాస్పద వ్యక్తిగా, అత్యాచార నిందితుడిగా ఉన్న నిత్యానంద ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేశం నుంచి పారిపోయి సొంతంగా శ్రీకైలాస పేరుతో ఒక దీవిలో సొంత దేశాన్ని ప్రకటించుకున్న నిత్యానంద శ్రీలంకను రాజకీయ ఆశ్రయం కోరారు.

శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు గత నెల 7నే నిత్యానంద ఈ లేఖ రాశారు. తాను తీవ్ర అనారోగ్యంతో ఉన్నాన‌ని.. సరైన వైద్య సదుపాయాలు శ్రీకైలాసలో లేవని, కాబట్టి శ్రీలంకలో వైద్యం పొందేందుకు వీలుగా రాజకీయ ఆశ్రయం కల్పించాలని కోరారు. శ్రీలంకలో తాను పెట్టుబడులు పెట్టేందుకు చేసిన ప్రతిపాదనలను లేఖలో గుర్తుచేశారు.

నిత్యానంద నుంచి లేఖ వచ్చిన విషయాన్ని శ్రీలంక ఉన్నతాధికారులు ధృవీకరించారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నాను.. వైద్య సదుపాయాలు లేవు కాబట్టి తనకు ఆశ్రయం ఇవ్వాలంటూ నిత్యానంద లేఖ రాశారని వెల్లడించారు. అత్యాచారం, కిడ్నాప్ తదితర కేసులు నిత్యానందపై ఉన్నాయి. కిడ్నాప్ ఆరోపణలపై గుజరాత్ పోలీసులు 2018లో అతడి శిష్యులిద్దరిని అరెస్ట్ చేశారు. తన అరెస్ట్‌ తప్పదని భావించిన నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. ఆ తర్వాత శ్రీకైలాస పేరుతో తనకు తాను ప్రకటించుకున్న ఒక దీవిలో తేలాడు.

ఇప్పటికే సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంక ఇలాంటి వివాదాస్పద వ్యక్తిని మీదేసుకుంటుందా అన్నది చూడాలి. అందులోనూ తమ దేశానికి సాయం చేస్తున్న ఇండియాలో నేరం చేసి తప్పించుకునిపారిపోయిన నిత్యానంద పట్ల శ్రీలంక ఎంత వరకు సానుకూలంగా స్పందిస్తుంది అన్నది ప్రశ్నార్థకమే.

First Published:  3 Sep 2022 4:07 AM GMT
Next Story