Telugu Global
International

మస్క్ మరో ప్రయోగం.. బ్లూ టిక్ తో పాటు అఫిషియల్ లేబుల్

వివిధ కంపెనీల అధికారిక అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అధినేతలు.. ఇలాంటి వారికి మాత్రమే అఫిషియల్ అనే లేబుల్ ఇస్తారు. అయితే అఫిషియల్ లేబుల్ కోసం వారు కూడా 8 డాలర్లు చెల్లించాల్సిందే.

మస్క్ మరో ప్రయోగం.. బ్లూ టిక్ తో పాటు అఫిషియల్ లేబుల్
X

ట్విట్టర్ ని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ ఉద్యోగులకే కాదు, ట్విట్టర్ యూజర్లకు కూడా చుక్కలు చూపెడుతున్నారు. బ్లూటిక్ కి రేటు కట్టిన మస్క్ కొత్తగా అఫిషియల్ లేబుల్ ని కూడా పరిచయం చేయబోతున్నారు. దీనికి కూడా సబ్ స్క్రిప్షన్ చార్జీలు వసూలు చేస్తామని చెబుతున్నారు. అయితే అఫిషియన్ లేబుల్ అనేది సబ్ స్క్రిప్షన్ చార్జీలు చెల్లించినవారందరికీ ఇవ్వరు. దానికి ప్రత్యేక అర్హతలుండాల్సిందే.

వివిధ కంపెనీల అధికారిక అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అకౌంట్లు, ప్రభుత్వ విభాగాల అధినేతలు.. ఇలాంటి వారికి మాత్రమే అఫిషియల్ అనే లేబుల్ ఇస్తారు. అయితే అఫిషియల్ లేబుల్ కోసం వారు కూడా 8 డాలర్లు చెల్లించాల్సిందే. అలాగని 8 డాలర్లు ఫీజు కట్టినవారందరికీ అఫిషియల్ లేబుల్ ఇవ్వరు. ఇక ఈ లేబుల్ తోపాటు బ్లూ టిక్ కూడా కొనసాగుతుందని తెలిపారు ట్విట్టర్ ప్రతినిధులు. సాధారణ అకౌంట్లలో కూడా పలు మార్పులు చేర్పులు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు.

కన్ఫ్యూజన్ పెరుగుతుందా..?

సాధారణ అకౌంట్లు, బ్లూ టిక్ అకౌంట్లు, అఫిషియల్ లేబుల్ ఉన్న అకౌంట్లు.. ఇలా రకరకాల ఖాతాలతో కన్ఫ్యూజన్ పెరిగే అవకాశముందని నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవి కేవలం ప్రయోగాలేనని, ప్రయోగ దశలో ఇలాంటి ఇబ్బందులు తప్పవని, ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయని అంటున్నారు ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ ఎస్తేర్ క్రాఫోర్డ్. ముందు ముందు ట్విట్టర్లో మరిన్ని మార్పులను వినియోగదారులు గమనిస్తారని అంటున్నారు. మస్క్ రాకతో ట్విట్టర్ వార్తల్లో నిలిచింది కానీ చాలామంది యూజర్లను కోల్పోయినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలే ట్విట్టర్ వాడకం బాగా పెరిగిందంటూ మస్క్ ఓ రిపోర్ట్ బయటపెట్టాడు. వాస్తవంలో ట్విట్టర్ యూజర్లను కోల్పోతోందని, ట్విట్టర్ కి పోటీగా ఉన్న ఇతర నెట్ వర్క్ లకు డిమాండ్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది.

First Published:  9 Nov 2022 9:53 AM GMT
Next Story