Telugu Global
International

భారత దేశంలో 54 శాతం మంది వాట్సప్ యూనివర్సిటీనే నమ్ముతున్నారు...రిపోర్ట్

భారతదేశంలో ప్రజలు వాట్సప్ లో వచ్చే వార్తలనే ఎక్కువగా నమ్ముతారని ఓ అధ్యయనం తేల్చింది. 54 శాతం మంది ప్రజలు వాట్సప్ న్యూస్ ను నమ్మగా అందులో 70 శాతం మోడీ ఫ్యాన్సే ఉన్నారట.

భారత దేశంలో 54 శాతం మంది వాట్సప్ యూనివర్సిటీనే నమ్ముతున్నారు...రిపోర్ట్
X

మెజారిటీ భారతీయ పౌరులు వాట్సాప్‌లో వచ్చే వార్తలను విశ్వసిస్తున్నారు, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం యొక్క రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ జర్నలిజం గురువారం విడుదల చేసిన ఒక అధ్యయనం తెలిపింది.

ఎక్కడి నుంచి వచ్చే వార్త లను ప్రజలు నమ్ముతారు అనే అంశం గురించి భారతదేశం, బ్రెజిల్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లోని పౌరుల ప్రతిస్పందనలను అధ్యయనం చేసింది ఆ సంస్థ. "వార్తలపై,డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో వచ్చే వార్తల గురించి ప్రజలు ఎలా ఆలోచిస్తారు" అనేదానిని పరిశీలించడానికి ఈ సంస్థ అధ్యయనం చేసింది.

అధ్యయనం ప్రకారం, భారతదేశంలో 77% మంది ప్రజలు సాధారణంగా వార్తా ప్రసార మాధ్యమాలను విశ్వసిస్తున్నారు. అదే సమయంలో, వారిలో వాట్సాప్ లో 54% మంది, గూగుల్ ,యూట్యూబ్‌లో 51%, ఫేస్‌బుక్‌లో 41%, ఇన్‌స్టాగ్రామ్‌లో 27%, ట్విట్టర్‌లో 25% , టిక్‌టాక్‌లో 15% మంది తమకు వచ్చిన వార్తలను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీపై అనుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నవారిలో 70% మంది వాట్సాప్‌లోని వార్తలను విశ్వసిస్తున్నారని, 58% మంది మోడీ గురించి ప్రతికూల వార్తలను విశ్వసిస్తున్నారని అధ్యయనం తెలిపింది.

భారతీయ ప్రజలలో దాదాపు సగం మంది (48%) కనీసం రోజుకు ఒక్కసారైనా ఆన్‌లైన్‌లో వార్తలను చూస్తారని చెప్పారు. ఇది అధ్యయనం చేసిన‌ నాలుగు దేశాలలో అత్యల్ప సంఖ్య. ఇదిలా ఉంటే, మరో 34% మంది భారతీయులు తమకు ఆన్‌లైన్ నుండి ఎప్పుడూ వార్తలు రాలేదని చెప్పారు.

46% మంది ప్రజలు రోజువారీ వార్తల కోసం వాట్సాప్ పైనే ఆధారపడతామని చెప్పారు.

రాజకీయంగా ఆసక్తి ఉన్న భారతీయులలో, చాలా మంది ప్రజలు (69%) వార్తల కోసం యూట్యూబ్‌ను విశ్వసిస్తున్నారని చెప్పారు. రాజకీయంగా ఆసక్తి లేని భారతీయులలో ఎక్కువ మంది (46%) వాట్సప్ ను నమ్ముతారు.

జర్నలిస్టుల పట్ల ప్రతికూల, సానుకూల అవగాహనల గురించి కూడా ప్రజలను అడుగగా భారతదేశంలో, జర్నలిస్టులు శక్తివంతమైన రాజకీయ నాయకుల అజెండాకు అనుగుణంగా పనిచేస్తారని, ప్రజల అభిప్రాయాలను తారుమారు చేస్తారని 58% మంది విశ్వసించారు, అయితే జర్నలిస్టులు వాస్తవాలను నివేదించడం కంటే ప్రజల దృష్టిని ఆకర్షించడంపైనే ఎక్కువ శ్రద్ధ వహిస్తారని 57% మంది విశ్వసించారు.

నాలుగు దేశాలలో, మెజార్టీ పౌరులు వార్తలకోసం ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ల‌ పైనే ఆధారపడతారని అధ్యయనం తెలిపింది.

మరో ముఖ్యమైన విషయం ఈ అధ్యయ‌నం తెలిపింది. చాలా మందిప్ర‌జలు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లను సమాచారం తెలుసుకోవడానికో, నాలెడ్జ్ కోసమో, తమకు దగ్గరైన వారిని కనెక్ట్ అవడం కోసం కాకుండా టైంపాస్ కోసమే ఉపయిగిస్తారట.

First Published:  24 Sep 2022 5:26 AM GMT
Next Story