Telugu Global
International

క్రేజీ 'కేజ్ ఫైట్'కు సిద్ధమవుతున్న మార్క్ జకర్‌బర్గ్, ఎలాన్ మస్క్

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, ట్విట్టర్ మధ్య గత కొంత కాలంగా వార్ నడుస్తోంది. సోషల్ మీడియాతో ఆధిపత్యం కోసం ఇరు సంస్థలు పోటీ పడుతున్నాయి.

క్రేజీ కేజ్ ఫైట్కు సిద్ధమవుతున్న మార్క్ జకర్‌బర్గ్, ఎలాన్ మస్క్
X

ప్రపంచకుబేరులు మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్‌లు క్రేజీ 'కేజ్ ఫైట్'కు దిగబోతున్నారు. బాక్సింగ్ తరహాలో ఉండే కేజ్ ఫైట్ అమెరికాలో చాలా ఫేమస్. అన్ని వైపులా బోనులు ఏర్పాటు చేసి.. ఇద్దరు లోపల తలపడతారు. అమెరికాలో ఈ మ్యాచ్‌లు చూడటానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఒక్కోసారి ఈ ఆటగాళ్లకు ప్రాణాపాయం కూడా కలుగుతుంది. అలాంటి కేజ్ ఫైట్‌ చేసుకుందాం అంటూ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా సవాళ్లు విసురుకున్నారు.

ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా, ట్విట్టర్ మధ్య గత కొంత కాలంగా వార్ నడుస్తోంది. సోషల్ మీడియాతో ఆధిపత్యం కోసం ఇరు సంస్థలు పోటీ పడుతున్నాయి. టెక్ట్స్ బేస్డ్ యాప్ ఒకటి తీసుకొని వస్తున్నట్లు మెటా ప్రకటించింది. ఇది ట్విట్టర్‌కు పోటీగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనిపై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్రోల్ కూడా చేశాడు. అప్పటి నుంచి ఇరువురి మధ్య సోషల్ మీడియాలో మాటల వార్ నడుస్తోంది. ఇప్పడది కేజ్ ఫైట్ వరకు రావడం విశేషం.

మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తనతో కేజ్ మ్యాచ్‌లో తలపడాలంటూ ఎలాన్ మస్క్ మొదట సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన జుకర్‌బర్గ్.. అడ్రస్ ఎక్కడో చెప్పాలంటూ ప్రతి సవాల్ విసిరారు. వీరిద్దరి సోషల్ మీడియా వార్ అందరికీ పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారింది.

సోషల్ మీడియాలో మెటా సంస్థ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఎలాన్ మస్క్ సరదాగా కేజ్ ఫైట్ చేద్దామంటూ చేసిన సవాలును జుకర్‌బర్గ్ నిజంగానే స్వీకరించాడు. జుకర్ అడ్రస్ చెప్పమని అడగ్గానే.. లాస్‌వెగాస్‌లో ఫైట్ చేద్దామని, అందుకు సిద్ధంగా ఉండాలంటూ ఎలాన్ మస్క్ ప్లేస్ కూడా డిసైడ్ చేశాడు. వీరిద్దరి సంభాషణలు చూసి అసలు ఏం జరుగుతుందంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ప్రపంచ కుబేరుల మధ్య ఈ కేజ్ ఫైట్ సవాలేంటని చర్చించుకుంటున్నారు. అయితే, ఈ మ్యాచ్ కనుక నిజంగా జరిగితే జుకర్ బర్గ్ గెలవడం ఖాయమని అంటున్నారు. జుకర్‌బర్గ్ ఇటీవలే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాడు. అంతే కాకుండా ఇటీవల జియు-జిట్సు టోర్నమెంట్‌లో పాల్గొని మెడల్ కూడా గెలుచుకున్నాడు. అనసవరంగా ఎలాన్ మస్క్ ఈ సవాలును విసిరాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒక వేళ ఈ మ్యాచ్ జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ రావడం ఖాయమని అంటున్నారు.

First Published:  23 Jun 2023 6:00 AM GMT
Next Story