Telugu Global
International

టెస్టింగ్ టైమ్‌లోనే పేలిపోయిన జ‌పాన్ రాకెట్‌

శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ప్రాణ‌న‌ష్టం ఏమైనా జ‌రిగిందా అనే విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు స‌మాచారం లేదని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.

టెస్టింగ్ టైమ్‌లోనే పేలిపోయిన జ‌పాన్ రాకెట్‌
X

ప్రపంచంలోనే అతి భారీ అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహించే దేశాల్లో ఒక‌టైన జపాన్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. జపాన్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేస్తున్న రాకెట్.. ఇంజిన్ ప‌రీక్ష‌ల స‌మ‌యంలోనే పేలిపోయింది. ఈ ప్ర‌మాద స‌మాచారాన్ని జ‌పాన్ స్పేస్ ఏజెన్సీ వెల్ల‌డించింది. శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ప్రాణ‌న‌ష్టం ఏమైనా జ‌రిగిందా అనే విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు స‌మాచారం లేదని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.

గతంలో ఉపయోగించిన ఎప్సిలాన్ రాకెట్‌ను అభివృద్ధి చేసి `ది ఎప్సిలాన్-ఎస్` ( Epsilon S) పేరిట జ‌పాన్‌ సిద్ధం చేసింది. తాజాగా అదే ప్రమాదానికి గురైంది. గత అక్టోబర్‌లో ఘన ఇంధనం ఆధారంగా పనిచేసే ఎప్సిలాన్ రాకెట్‌ను జ‌పాన్‌ ప్రయోగించింది. అప్పట్లో ఆ ప్రయోగం విఫలమైంది. తాజా మార్పులతో పరీక్షించగా.. ప్రయోగం మొదలైన 50 సెకన్లలోనే విఫలమైంది. ఈ పరీక్షా కేంద్రం ఉత్తర ఆకితా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం భారీ ఎత్తున మంటలు, పొగలతో నిండిపోయింది. దీనికి సంబంధించిన చిత్రాలను జాతీయ మీడియా సంస్థ ప్రసారం చేసింది.

First Published:  14 July 2023 6:49 AM GMT
Next Story