Telugu Global
International

బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ ఓటమి తప్పదా ? సర్వే చెప్తున్న నిజాలు

'బెస్ట్ ఫర్ బ్రిటన్' అనేసంస్థ చేపట్టిన సర్వే ఫలితాలను ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక రిపోర్ట్ చేసింది. ఆ సర్వే డేటా ప్రకారం, 2024లో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన మంత్రి సునక్, ఉప ప్రధాని డొమినిక్ రాబ్, ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లేతో సహా సీనియర్ టోరీ (కంజర్వేటీవ్ పార్టీ)వ్యక్తులు ఓడిపోనున్నారు.

బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ ఓటమి తప్పదా ? సర్వే చెప్తున్న నిజాలు
X

బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్, అతని 15 మంది కేబినెట్ మంత్రులు 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోనున్నారని తాజా సర్వే చెప్పింది.

'బెస్ట్ ఫర్ బ్రిటన్' అనేసంస్థ చేపట్టిన సర్వే ఫలితాలను ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక రిపోర్ట్ చేసింది. ఆ సర్వే డేటా ప్రకారం, 2024లో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన మంత్రి సునక్, ఉప ప్రధాని డొమినిక్ రాబ్, ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లేతో సహా సీనియర్ టోరీ (కంజర్వేటీవ్ పార్టీ)వ్యక్తులు ఓడిపోనున్నారు.

విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ, డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్, బిజినెస్ సెక్రటరీ గ్రాంట్ షాప్స్, కామన్స్ లీడర్ పెన్నీ మోర్డాంట్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ థెరిస్ కాఫీ కూడా తమ స్థానాలను కోల్పోవచ్చని 'బెస్ట్ ఫర్ బ్రిటన్' పోలింగ్ తెలిపింది.

సర్వే ప్రకారం 2024 ఎన్నికల్లో కేవలం ఐదుగురు కేబినెట్ మంత్రులు - జెరెమీ హంట్, భారతీయ సంతతికి చెందిన సుయెల్లా బ్రవర్‌మాన్, మైఖేల్ గోవ్, నదీమ్ జవావి, కెమీ బాడెనోచ్ మాత్రమే గెలుస్తారు.

చాలా ఏళ్ళుగా అధికారానికి కీలకంగా ఉన్న 10 స్థానాలు ఈ సారి లేబర్ పార్టీకి దక్కనున్నాయని సర్వే తెలిపింది.

టోరీలు మూడు సార్లు ప్రధానులను మార్చడం , ఆర్థిక రంగం దిగజారడం పట్ల‌ ఓటర్లు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఓటర్ల నమ్మకాన్ని గెల్చుకోవడానికి రిషి సునక్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తాజాగా జరిగిన సర్వేలో లేబర్ పార్టీ టోరీల కన్నా20 పాయింట్లు అధికంగా సాధించింది. అందువల్ల ఈ సారి టోరీలు ఓడిపోవడం ఖాయమని సర్వే తేల్చి చెప్పింది.

అయితే ఈ ఏడాది మేలో బ్రిటన్ లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు సునక్ కు అసలైన పరీక్షగా నిలుస్తాయి. ఒక వేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్ళీ బోరిస్ జాన్సన్ కు అప్పగించాలని అప్పుడే పలువురు టోరీ సభ్యులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు.

First Published:  10 Jan 2023 2:48 AM GMT
Next Story