Telugu Global
International

భారతీయ కంపెనీ ఐ డ్రాప్స్ వ‌ల్ల అమెరికాలో ఒకరి మరణం, పలువురికి చూపు మందగింపు

చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ సంస్థ తయారు చేసిన ఎజ్రీకేర్ అనే ఐ డ్రాప్స్ వల్ల అమెరికాలో ఓ వ్యక్తి మరణించగా, పలువురికి కంటి చూపు మందగించింది. దా‍ంతో అమెరికా ఆ డ్రాప్స్ పై నిషేధం విధించింది.

భారతీయ కంపెనీ ఐ డ్రాప్స్ వ‌ల్ల అమెరికాలో ఒకరి మరణం, పలువురికి చూపు మందగింపు
X

భారత్ దేశం నుండి విదేశాలకు ఫార్మా ఉత్పత్తుల‌ ఎగుమతులు గణనీయమైన స్థాయిలో పెరిగిపోయాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ శుక్రవారం రాజ్యసభకు తెలియజేసిన సమయంలోనే అమెరికానుంచి వచ్చిన ఓ వార్త ఆందోళన సృష్టించింది.

చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ సంస్థ తయారు చేసిన ఎజ్రీకేర్ అనే ఐ డ్రాప్స్ వల్ల అమెరికాలో ఓ వ్యక్తి మరణించగా, పలువురికి కంటి చూపు మందగించింది. దా‍ంతో అమెరికా ఆ డ్రాప్స్ పై నిషేధం విధించింది.

ఈ డ్రాప్స్ వాడటం వల్ల ఇప్పటి వరకు, కంటి ఇన్ఫెక్షన్‌లు, శాశ్వత దృష్టి కోల్పోవడం, రక్తప్రవాహంలో ఇన్‌ఫెక్షన్‌తో మరణించడం వంటి ప్రతికూల సంఘటనల గురించి 55 నివేదికలు వచ్చాయి.

కళ్ళ మంట, కళ్ళు పొడిబారడం వంటి సమస్యలకు ఈ ఐ డ్రాప్స్ ను ఉపయోగిస్తారు.

"కలుషితమైన ఈ ఐ డ్రాప్స్ ను ఉపయోగించడం వలన అంధత్వానికి దారితీసే కంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది" అని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA ) హెచ్చరించింది.

ఈ సంఘటన‌ జరిగిన వెంటనే గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ తన ఐడ్రాప్స్ మొత్తాన్ని వెనక్కి రప్పించింది.

గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, ఎజ్రీకేర్ ఐ డ్రాప్స్ ను మొత్తాన్ని రీకాల్ చేస్తున్నట్టు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, కస్టమర్‌లు దీనిని ఉపయోగించడం మానేయాలని అభ్యర్థించింది.

ఇప్పటికే ఈ డ్రాప్స్ ను ఉపయోంగించిన వినియోగదారులు ఏవైనా సమస్యలు ఎదురైతే, తమ ఫిజిషియన్ లేదా హెల్త్‌కేర్ ప్రొవైడర్‌ను సంప్రదించాలని పేర్కొంది.

గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ఆగ్నేయాసియా, మధ్య అమెరికా, ఆఫ్రికాలోని వివిధ మార్కెట్‌లకు అనేక ఔషధాలను సరఫరా చేస్తుంది.

కాగా, ఇటీవల భారత్ కు చెందిన దగ్గు మందుల కారణంగా గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో పిల్లలు మరణించిన విషయం తెలిసిందే.

నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన ‘డాక్-1మాక్స్ ’ సిరప్ తాగి ఉజ్బె కిస్థాన్ లో 18 మం ది పిల్లలు మరణించగా, హరియాణాలోని సోనెపట్ కేంద్రంగా పనిచేసే ‘మైడెన్ ఫార్మా ’ కం పెనీ ఉత్ప త్తి చేసిన సిరప్ తాగి గాంబియాలో 66 మంది పిల్లలు మరణించినట్లు వార్తలు వచ్చాయి.

First Published:  3 Feb 2023 4:56 PM GMT
Next Story