Telugu Global
International

ఇజ్రాయిల్‌లో ఇండియన్స్‌ కోసం ఆపరేషన్‌ అజయ్‌

వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాల్లోని భారతీయుల భద్రత కోసం కట్టుబడి ఉన్నామంటూ ఆ శాఖ మంత్రి జైశంకర్‌ ట్వీట్ చేశారు.

ఇజ్రాయిల్‌లో ఇండియన్స్‌ కోసం ఆపరేషన్‌ అజయ్‌
X

ఇజ్రాయిల్‌, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్‌ హమాస్‌ మధ్య భీకర పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న ఇండియ‌న్స్‌ని స్వ‌దేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఆపరేషన్‌ అజయ్‌ను ప్రారంభించింది. ఇజ్రాయిల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విదేశాల్లోని భారతీయుల భద్రత కోసం కట్టుబడి ఉన్నామంటూ ఆ శాఖ మంత్రి జైశంకర్‌ ట్వీట్ చేశారు. ఇండియాకు తిరిగిరావడానికి రిజిస్టర్ చేసుకున్న వారి కోసం శుక్రవారం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయిల్‌లోని రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

శనివారం ఉదయం హమాస్‌ ఆకస్మిక దాడితో తేరుకున్న ఇజ్రాయిల్‌.. ఆ మిలిటెంట్ సంస్థపై యుద్ధం ప్రకటించింది. హమాస్‌ స్థావరాలున్న గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం కురిపిస్తోంది. గత ఐదు రోజుల్లో రెండు వైపులా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిర్వాసితులుగా మారారు. గాజాస్ట్రిప్‌ను ఇజ్రాయిల్‌ పూర్తిగా దిగ్బంధించింది.

ఇక హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ 150 మందిని బందీలుగా చేసుకుందని ఇజ్రాయిల్ ఓ ప్రకటనలో తెలిపింది. 150 మందిలో థాయ్‌లు, ఇద్దరు మెక్సికన్లు, అమెరికన్లు, జర్మన్లు ఉన్నారని తెలిపింది. ఇక లెబనాన్‌ వైపు నుంచి హిజ్బుల్లా, ఇరాన్ సపోర్ట్‌తో షియా మిలిటెంట్ గ్రూప్‌ ఇజ్రాయిల్‌పై దాడి చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయిల్‌ మూడు వైపులా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

First Published:  12 Oct 2023 2:51 AM GMT
Next Story