Telugu Global
International

భారత్ లో మైనార్టీల జనాభా పెరుగుతోంది...పాకిస్తాన్ లో తగ్గుతోంది... నిర్మలా సీతారామన్

''పాకిస్తాన్ ను ఇస్లామిక్ దేశంగా సృష్టించారు. మైనారిటీలను సమానంగా చూస్తామని ఆ దేశం హామీ ఇచ్చింది. కానీ అక్కడ మెజారిటీ కమ్యూనిటీతో ఏకీభవించని అనేక ముస్లిం వర్గాలు, ఇతర మైనార్టీలు జనాభా పరంగా తగ్గిపోతున్నాయి.'' అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

భారత్ లో మైనార్టీల జనాభా పెరుగుతోంది...పాకిస్తాన్ లో తగ్గుతోంది... నిర్మలా సీతారామన్
X

భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై హింస జరుగుతోందని పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఖండించారు, ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు వచ్చి ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న భారత్ లోని వాస్తవాన్ని చూడాలని అన్నారు. భారత్ లో మైనారిటీల జనాభా విపరీతంగా పెర‌గడమే కాదు, వారు దేశంలో తమ వ్యాపారాలను పెద్ద ఎత్తున చేస్తున్నారు అని అన్నారు

అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థిక మంత్రి మీడియా అడిగిన పలు ప్రశ్న‌లకు జవాబు ఇచ్చారు. ''పాకిస్తాన్ ను ఇస్లామిక్ దేశంగా సృష్టించారు. మైనారిటీలను సమానంగా చూస్తామని ఆ దేశం హామీ ఇచ్చింది. కానీ అక్కడ మెజారిటీ కమ్యూనిటీతో ఏకీభవించని అనేక ముస్లిం వర్గాలు, ఇతర మైనార్టీలు జనాభా పరంగా తగ్గిపోతున్నాయి.'' అని అన్నారు.

"దీనికి విరుద్ధంగా, భారతదేశంలో 1947 తర్వాత మైనారిటీ జనాభా పెద్ద ఎత్తున పెరిగింది. వారు చాలా స్వేచ్చగా వ్యాపారాలను చేసుకుంటున్నారు... వారు స్కాలర్‌షిప్‌లను పొందుతున్నారు. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది. భారత్ లో ఎలాంటి మతపరమైన గొడవలులేవు కాబట్టే పెట్టుబడిదారులు భారతదేశానికి వస్తున్నారనే వాస్తవం దృష్టిలో పెట్టుకోవాలి. గ్రౌండ్‌లో ఏమి జరుగుతుందో కూడా చూడని వారి మాటలు వినడం కంటే దయచేసి వచ్చి వాస్తవాన్ని మీరే చూడండి ”అని ఆమె మీడియా ఇంటరాక్షన్‌లో అన్నారు.

First Published:  11 April 2023 6:38 AM GMT
Next Story