కువైత్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత
కువైత్ లో ఆదివారంనాడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్నడూ లేని విధంగా 53 సెల్సియస్ డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
BY Telugu Global8 Aug 2022 11:11 AM GMT

X
Telugu Global8 Aug 2022 11:11 AM GMT
ఎడారి దేశం కువైత్ లో ఆదివారం అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది, అల్ జహ్రా మెటలాజికల్ స్టేషన్‌లో 53 సెల్సియస్ డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదుకాగా, అల్-సులైబియా స్టేషన్‌లో 52.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
కువైట్ వాతావరణ శాఖ ప్రకారం సోమవారం కూడా అత్యంత వేడి వాతావరణం కొనసాగుతుంది. తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాత్రికి తేమ క్రమంగా తగ్గి గాలులు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం నుండి గురువారం వరకు వాతావరణం చాలా వేడిగా ఉంటుందని, వాయువ్య గాలులు పెరుగుతాయని, దీని వలన ఉష్ణోగ్రతలు 48 నుండి 50 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఎండాకాలం బైట పనిచేయడం ఈ దేశంలో నిషేధం అయినప్పటికీ ఇది సరిగా అమలు కాకపోవడం వల్ల ఇతర దేశాల నుంచి వెళ్ళిన కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Next Story