Telugu Global
International

నైట్‌ క్లబ్‌లో ప్రమాదం.. 29 మంది మృతి

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి ఫైరింజన్లు, అంబులెన్సులు, మెడికల్ టీమ్స్ చేరుకున్నాయి. ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తుండగా, గాయపడిన వారిని, మరణించిన వారిని ఆస్ప‌త్రుల‌కు తరలించారు.

నైట్‌ క్లబ్‌లో ప్రమాదం.. 29 మంది మృతి
X

టర్కీలోని ఇస్తాంబుల్ నైట్ క్లబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 29 మంది చనిపోయారు. నైట్ క్లబ్‌లో రిపైర్‌ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో క్లబ్ మేనేజర్లతోపాటు ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి ఫైరింజన్లు, అంబులెన్సులు, మెడికల్ టీమ్స్ చేరుకున్నాయి. ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తుండగా, గాయపడిన వారిని, మరణించిన వారిని ఆస్ప‌త్రుల‌కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

బెసిక్టాస్ జిల్లాలోని 16 అంతస్తుల భవనంలో ఈ మాస్‌క్య్వైరబుల్ నైట్ క్లబ్ ఉంది. రిపైర్ల కోసం క్లబ్ గ్రౌండ్ ఫ్లోర్, బేస్మెంట్ ఫ్లోర్లను మూసేశారు. ప్రమాద కారణాలపై విచారణ జరుగుతుందని ఇస్తాంబుల్ ప్రభుత్వం తెలిపింది. అగ్ని ప్రమాదం సంగతి తెలియగానే గవర్నర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

First Published:  3 April 2024 1:55 AM GMT
Next Story