Telugu Global
International

ఆర్టీసీ బస్సా.. ఇంటర్నేషనల్ ఫ్లైటా.. చెంపలు వాయించుకున్న యువకులు..!

బ్యాంకాక్ నుంచి కోల్ కత్తా వస్తున్న విమానం టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లో ఉన్న సమయంలో అద్దాలు పెట్టుకున్న ఓ యువకుడు తన ఎదురుగా బ్లాక్ షర్ట్ వేసుకున్న యువకుడితో గొడవపడ్డాడు.

ఆర్టీసీ బస్సా.. ఇంటర్నేషనల్ ఫ్లైటా.. చెంపలు వాయించుకున్న యువకులు..!
X

మామూలుగా రద్దీగా ఉండే బస్టాండ్ లలో బస్సులు ఎప్పుడెప్పుడు వస్తాయా.. అని ప్రయాణికులు ఎదురుచూస్తుంటారు. బస్సు వచ్చి రాగానే దాని వెంట పడుతూ కొందరు.. కిటికీలకు వేలాడుతూ, మరికొందరు తమ చేతుల్లోని కర్చీఫ్ లు బస్సు సీట్లలో వేస్తుంటారు. ఈ క్రమంలో ఒకరు కర్చీఫ్ వేసిన సీట్లో మరొకరు బయట నుంచి కనిపించక వేస్తుంటారు. చివరికి బస్సు ఎక్కిన తర్వాత నేను ముందు కర్చీఫ్ వేశానంటే.. నేను వేశానంటూ గొడవ పడటం చూస్తుంటాం.

అయితే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కొంతమంది యువకులు గొడవ పడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అందులో గొడవ పడుతున్న వారు సీటు కోసం గొడవ పడుతున్నారో, మరి దేనికోసం గొడవ పడుతున్నారో క‌చ్చితమైన కారణం తెలియదు కానీ, వారు మాత్రం పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు. ఈ ఘటన థాయిలాండ్ కు చెందిన థాయ్ స్మైల్ ఎయిర్ వేస్ విమానంలో జరిగింది.

బ్యాంకాక్ నుంచి కోల్ కత్తా వస్తున్న విమానం టేకాఫ్ అయ్యింది. విమానం గాల్లో ఉన్న సమయంలో అద్దాలు పెట్టుకున్న ఓ యువకుడు తన ఎదురుగా బ్లాక్ షర్ట్ వేసుకున్న యువకుడితో గొడవపడ్డాడు. వీరిద్దరి మధ్య మొదట ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. ఒకరి చెంపలు మరొకరు వాయించుకున్నారు. ఇంతలో అద్దాలు పెట్టుకున్న యువకుడికి మద్దతుగా మరి కొంతమంది యువకులు అక్కడికి వచ్చారు. దీంతో ఎదురుగా ఉన్న యువకుడు కొంత వెనక్కి తగ్గాడు. దీంతో అద్దాలు పెట్టుకున్న యువకుడు ఆ యువకుడిని పిచ్చ కొట్టుడు కొట్టాడు. చెంపలు వాయించే కార్యక్రమం కొన్ని నిమిషాల పాటు ఇలాగే కొనసాగింది.

తోటి ప్రయాణికులు, విమానంలో ఉన్న సిబ్బంది ఎంత సర్దిచెప్పినా ఆ యువకులు వెనక్కి తగ్గలేదు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారు ఇది ఆర్టీసీ బస్సా.. ఇంటర్నేషనల్ ఫ్లైటా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.



First Published:  29 Dec 2022 7:56 AM GMT
Next Story