Telugu Global
International

ట్రంప్ ఇంటిపై ఎఫ్ బీ ఐ దాడి

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాసంపై FBI దాడి చేసింది. వైట్ హౌజ్ నుండి ట్రంప్ తీసుకవచ్చిన కొన్ని కీలక పత్రాల కోసమే ఈ దాడి జరిగినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

ట్రంప్ ఇంటిపై ఎఫ్ బీ ఐ దాడి
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసముండే మార్-ఎ-లాగో ఎస్టేట్‌పై FBI అధికారులు దాడి చేశారు. ట్రంప్ ఓటమి తర్వాత వైట్ హౌజ్ ఖాళీ చేస్తున్న సమయంలో ఆయన తీసుకవచ్చిన ముఖ్యమైన పత్రాల కోసం ఈ దాడి జరిగిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

దీనిపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, FBI ఏజెంట్లు సోమవారం నా ఎస్టేట్‌పై దాడి చేసి, నా ఇంట్లోకి చొరబడ్డారు. నా ఎస్టేట్ ప్రస్తుతం ముట్టడిలో ఉంది, దాడి చేయబడింది, ఆక్రమించబడింది" అని ట్రంప్ అన్నారు. ''నేను సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో పూర్తిగా సహకరిస్తున్నాను. అయినా కూడా నా ఇంటిపై ఈ అప్రకటిత దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది" అని ట్రంప్ ప్రశ్నించారు

ఫబి దాడి సమయంలో ట్రంప్ ఎస్టేట్‌లో లేరని, ఆవరణలోకి ప్రవేశించేందుకు ఎఫ్‌బీఐ సెర్చ్ వారెంట్‌ని తీసుకొచ్చిందని రాయిటర్స్ నివేదించింది.

అయితే ఈ దాడిపై వ్యాఖ్యానించడానికి జస్టిస్ డిపార్ట్‌మెంట్ నిరాకరించింది. వాషింగ్టన్‌లోని FBI ప్రధాన కార్యాలయం, మయామిలోని దాని ఫీల్డ్ ఆఫీస్ రెండూ కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.

First Published:  9 Aug 2022 4:48 AM GMT
Next Story