Telugu Global
International

ట్విట్టర్ లో బైడెన్ క‌న్నా తనకు తక్కువ వ్యూస్ రావడంతో మస్క్ ఫీలయ్యాడు....ఉద్యోగాలు పీకేస్తానని ఇంజనీర్లను బెదిరించాడు

ఎలాన్ మస్క్ ట్వీట్ కు 90 లక్షల వ్యూస్ రాగా, బైడెన్ ట్వీట్ కు 2 కోట్ల 90 లక్షల వ్యూస్ వచ్చాయి. దాంతో మస్క్ రగిలిపోయాడు. అలిగి తన ట్వీట్ ను డిలీట్ చేసేశాడు.

ట్విట్టర్ లో బైడెన్ క‌న్నా తనకు తక్కువ వ్యూస్ రావడంతో మస్క్ ఫీలయ్యాడు....ఉద్యోగాలు పీకేస్తానని ఇంజనీర్లను బెదిరించాడు
X

ట్విట్టర్ ను కొనుగోలు చేయడంలో ఎంత డ్రామా జరిగిందో కొన్నాక కూడా ఎలాన్ మస్క్ అంతే డ్రామా పండిస్తున్నారు. ప్రతిరోజూ తన ట్వీట్లకు ఇతరులందరికన్నా ఎక్కువ వ్యూస్ రావాలని ఆయన కోరిక. తాజాగా ఆయన కోరికకు దెబ్బతగలడంతో అలిగిన మస్క్ ట్విట్టర్ లో పని చేసే ఇంజనీర్లను బెదిరించాడు. అందరికన్నా తనకు ఎక్కువ వ్యూస్ రాకపోతే ఉద్యోగాలు పీకేస్తానని హెచ్చరించాడు.

అసలేం జరిగిందంటే.... అమెరికాలో పిలడెల్ఫియా ఈగిల్స్, కాన్సాస్ సిటీ చీఫ్స్ ఫుట్ బాల్ టీం ల మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. ఎలాన్ మస్క్ పిలడెల్ఫియా ఈగిల్స్ టీం కు మద్దతు తెలుపుతూ ఓ ట్వీట్ చేశాడు. అమెరికాఅధ్యక్షుడు జో బైడెన్ కూడా అదే టీం కు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. అయితే ఎలాన్ మస్క్ ట్వీట్ కు 90 లక్షల వ్యూస్ రాగా, బైడెన్ ట్వీట్ కు 2 కోట్ల 90 లక్షల వ్యూస్ వచ్చాయి. దాంతో మస్క్ రగిలిపోయాడు. అలిగి తన ట్వీట్ ను డిలీట్ చేసేశాడు.

మస్క్ అక్కడితో ఆగలేదు. ట్విట్టర్ లో పని చేస్తున్న 80 మంది ఇంజనీర్లను పిలిచాడు. తనకు వ్యూస్ తక్కువ ఎందుకు వచ్చాయో జవాబు చెప్పాలని గద్దించాడు. కోడింగ్, ఆల్గరిథమ్ లలో మార్పులు చేసి వెంటనే తన ట్వీట్లకు ఎక్కువ వ్యూస్ వచ్చేట్టు చేయాలని వారిని ఆదేశించాడు. అది జరగకపోతే అందరిని ఉద్యోగాల్లోంచి పీకేస్తానని హెచ్చరించాడు.

ఈ సమస్యను పరిష్కరించి ఎలాన్ మస్క్ కు ఎక్కువ వ్యూస్ వచ్చేట్టు చేయగల వారెవరైనా ఉంటే తమను సంప్రదించాలని మస్క్ బంధువు జేమ్స్ మస్క్ అనే అతను ఓ గ్రూపులో పోస్ట్ చేశారు.

ఇక‌ ట్విట్ట‌ర్ ఇంజనీర్‌లందరూ పగలూ రాత్రి పని చేసి కోడింగ్, ఆల్గరిథమ్ లలో అనేక మార్పులు చేశారు. దాంతో ప్రతి ఒక్క ట్విట్టర్ యూజర్ టైమ్ లైన్ పై మస్క్ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై అనేక మంది ట్విట్టర్ యూజర్లు అసంత్రుప్తి వ్యక్తం చేశారు.

కాగా, ప్రజలు ఎలాన్ మస్క్ పై ఆసక్తిని కోల్పోతున్నందున అతని ట్వీట్లకు వ్యూస్ తగ్గుతున్నాయని ఒక ఇంజనీర్ మస్క్‌తో చెప్పడంతో మస్క్ వెంటనే ఆ ఇంజనీర్ ను ఉద్యోగంలోంచి పీకేశాడని ఓ పత్రిక గత వారం రిపోర్ట్ చేసింది.

First Published:  15 Feb 2023 2:27 PM GMT
Next Story