Telugu Global
International

ఎలన్ మస్క్ సొంత సోషల్ మీడియా?

ట్విట్టర్‌తో వివాదం ఎటూ తేలకపోవడంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరహాలో సొంతంగా ఓ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.

ఎలన్ మస్క్ సొంత సోషల్ మీడియా?
X

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్‌తో వివాదం ఎటూ తేలకపోవడంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరహాలో తానే సొంతంగా ఓ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్య‌క్ష‌ ఎన్నికల సమయంలో బైడెన్‌ గెలుపును అడ్డుకునేందుకు ట్రంప్ రకరకాల దారులు ఉపయోగించుకున్నాడు. ట్రంప్‌ను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా సైట్లు శాశ్వతంగా బ్యాన్‌ చేయడంతో ఆ టైంలో ట్రంప్‌ సొంతంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌ సోషల్‌ను లాంచ్‌ చేశారు.

ఇప్పుడిదే తరహాలో మస్క్ కూడా ఒక సొంత సోషల్ మీడియాను తయారు చేసుకునే ఆలోచనలో ఉన్నాడు. ట్విట్టర్ లాంటి మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒక ట్విట్టర్‌ యూజర్‌..'ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందం రద‍్దయితే మీరు సొంత సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను ప్రారంభిస్తారా? అని ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు ఎలాన్‌ మస్క్‌.. 'ఎక్స్‌.కామ్‌' నా సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ అంటూ రిప్లై ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఓ నెటిజన్‌ 'మీరు ఓపెన్ అల్గారిథమ్‌తో సోషల్ మీడియా సైట్‌ని క్రియేట్‌ చేస్తారా' అని ట్వీట్ చేయగా.. 'ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తా' అని మస్క్‌ అన్నారు. అయితే ఎలాన్‌ మస్క్‌ చెప్పిన ఎక్స్‌.కామ్‌లో గతంలో ఆర్ధిక కార్యకలాపాలు జరిగేవి. ఇప్పుడు ఆ సైట్‌లో ఎలాంటి కంటెంట్‌ లేకపోవడంతో ఎలాన్‌ మస్క్‌ చెప్పింది నిజమే అయి ఉండ‌వ‌చ్చ‌ని నెటిజన్లు భావిస్తున్నారు.

First Published:  12 Aug 2022 4:38 PM GMT
Next Story