Telugu Global
International

ఉద్యోగుల‌కు సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ భారీ షాక్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొన్న ఆర్థిక మాంద్యం ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఖ‌ర్చులు త‌గ్గించుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

ఉద్యోగుల‌కు సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ భారీ షాక్‌
X

అమెరికాలోని అరిజోనా కేంద్రంగా ప‌నిచేస్తున్న బిష‌ప్ ఫాక్స్ అనే సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ త‌న ఉద్యోగుల‌కు ఊహించ‌ని షాకిచ్చింది. త‌న కంపెనీ ఉద్యోగుల‌కు మంచి పార్టీ ఇచ్చిన సంస్థ‌.. ఉద‌యానికే 13 శాతం మందిని తొల‌గిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. దీంతో ఆ ఉద్యోగుల‌కు రాత్రి పార్టీ స‌ర‌దా ఒక్క‌సారిగా దిగిపోయింది.

కంపెనీ నిర్ణ‌యాన్ని జీర్ణించుకోలేక‌పోయిన ఉద్యోగులు.. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కంపెనీ నిర్ణ‌యాన్ని అస‌లు ఊహించ‌లేక‌పోయామ‌ని వారు చెబుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా నెల‌కొన్న ఆర్థిక మాంద్యం ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఖ‌ర్చులు త‌గ్గించుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

సాంకేతిక రంగంలో కంపెనీ ప్ర‌స్తుతం న‌మోదు చేస్తున్న గ‌ణాంకాల‌ను మ‌రింత మెరుగుప‌రుస్తామ‌ని బిష‌ప్ ఫాక్స్ సీఈవో విన్నే లూ వెల్ల‌డించారు. కంపెనీపై ఆర్థిక భారం త‌గ్గించుకునేందుకే ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు.

First Published:  6 May 2023 3:04 AM GMT
Next Story