Telugu Global
International

గూగుల్ ఆఫీస్ లో టీ, కాఫీ కట్..

గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అంత పెద్ద కంపెనీ కనీసం ఉద్యోగులకు టీ, కాఫీ ఇవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు.

గూగుల్ ఆఫీస్ లో టీ, కాఫీ కట్..
X

చిన్న చిన్న కంపెనీలు కూడా ఉద్యోగులకు టీ, కాఫీ ఉచితంగా ఇస్తుంటాయి, ఓ మోస్తరు కంపెనీలు బ్రేక్ ఫాస్ట్, లంచ్ కూడా ఫ్రీగా అందజేస్తాయి. అలాంటిది మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ లో ఇంకెన్ని సౌకర్యాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. ఆ కంపెనీలో కూడా ఉద్యోగులకు మంచి మంచి సౌకర్యాలు కల్పిస్తారు. ఫ్రీ స్నాక్స్, లాండ్రీ సర్వీస్, మసాజ్, ఉద్యోగులకు లంచ్ అందించే మైక్రో కిచెన్ సదుపాయాలు అక్కడ ఉంటాయి. అయితే వీటన్నిటినీ ఇప్పుడు కంపెనీ ఆపేసింది. ఇది టెంపరరీనా లేక పూర్తి స్థాయిలో సౌకర్యాలన్నీ నిలిపివేస్తారా అనేది తేలాల్సి ఉంది.

టీ, కాఫీ, స్నాక్స్, లంచ్.. ఇవేవీ ఇక గూగుల్ ఆఫీస్ లో ఉచితం కాదు. ఇప్పటికే 12వేలమంది ఉద్యోగులను తొలగించింది గూగుల్. కాస్ట్ కటింగ్ లో భాగంగా ఉద్యోగుల్ని తొలగించడంతోపాటు, ఉన్నవారికి ఇచ్చే సౌకర్యాలను కూడా నిలిపివేశారు. కొత్త రిక్రూట్ మెంట్లు అసలే లేవు. ఆర్దిక మాంద్యంతో గూగుల్ సహా ఇతర దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగించే ప్రక్రియ మొదలు పెట్టాయి. ఫస్ట్ రౌండ్ పూర్తయింది. ఇంకా ఉద్యోగులను లే ఆఫ్ ల భయం వెంటాడుతోంది.

ఉద్యోగులకు ఉచితంగా స్నాక్స్, లంచ్.. ఇతరత్రా సేవలకు గూగుల్ ప్రసిద్ధి. గూగుల్ లో జరిగినట్టు ఇంకెక్కడా ఉద్యోగులకు రాచమర్యాదలు ఉండవని అంటారు. పని వాతావరణం గూగుల్ లో చాలా సుఖవంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు గూగుల్ కూడా ఇతర కంపెనీలను ఫాలో అవుతోంది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అంత పెద్ద కంపెనీ కనీసం ఉద్యోగులకు టీ, కాఫీ ఇవ్వలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు మాత్రం మళ్లీ మంచిరోజులు రాకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

First Published:  1 April 2023 11:26 AM GMT
Next Story