Telugu Global
International

చాట్ జీపీటీకి పోటీగా బైదూ ఎర్నీ - రంగంలోకి చైనా సంస్థ‌

చైనాకు చెందిన అతి పెద్ద సెర్చింజ‌న్ బైదూ ఇప్ప‌టికే చాట్‌బాట్ ఎర్నీని సిద్ధం చేస్తోంది. మార్చి నుంచి ఈ సెర్చింజ‌న్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు బైదూ వెల్ల‌డించింది. ఈలోగా ఎర్నీ బాట్ అంత‌ర్గ‌త ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేస్తామ‌ని ఆ సంస్థ తెలిపింది.

చాట్ జీపీటీకి పోటీగా బైదూ ఎర్నీ    - రంగంలోకి చైనా సంస్థ‌
X

మైక్రోసాఫ్ట్ రూపొందించిన చాట్ జీపీటీ విప్ల‌వాత్మ‌క మార్పులు తెస్తుంటే.. దీనికి పోటీగా గూగుల్ చాట్‌బాట్ బార్డ్‌ను రంగంలోకి తెస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండింటిలోనూ ఇప్ప‌టికే ఎదుర‌వుతున్న సాంకేతిక స‌మ‌స్య‌ల‌ను స‌రిచేసుకుంటూ.. పూర్తిస్థాయిలోకి రంగంలోకి వ‌చ్చేందుకు ఆయా సంస్థ‌లు ముమ్మ‌రంగా ఏర్పాట్లు చేసుకుంటుండ‌గా, ఇప్పుడు వీటికి పోటీగా చైనా సంస్థ రంగంలోకి వ‌స్తోంది.

చైనాకు చెందిన అతి పెద్ద సెర్చింజ‌న్ బైదూ ఇప్ప‌టికే చాట్‌బాట్ ఎర్నీని సిద్ధం చేస్తోంది. మార్చి నుంచి ఈ సెర్చింజ‌న్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్టు బైదూ వెల్ల‌డించింది. ఈలోగా ఎర్నీ బాట్ అంత‌ర్గ‌త ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేస్తామ‌ని ఆ సంస్థ తెలిపింది.

బైదూకు చెందిన సెర్చ్‌, క్లౌడ్ సేవ‌ల్లో ఎర్నీ బాట్‌ను స‌మీకృతం చేశామ‌ని బైదూ సీఈవో రాబిన్ లీ తెలిపారు. స్మార్ట్ కార్ ఆప‌రేటింగ్ వ్య‌వ‌స్థ‌, స్మార్ట్ స్పీక‌ర్‌కు కూడా దీనిని క‌లిపేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. దీంతో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో ప‌నిచేసే ఈ సెర్చింజ‌న్ల మ‌ధ్య ఇప్పుడు పోటీ ఏర్ప‌డ‌నుంది.

ప్ర‌స్తుతం ఈ వార్త‌ల‌తో న్యూయార్క్‌లో బుధ‌వారం జ‌రిగిన ముంద‌స్తు మార్కెట్ ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు ఏడు శాతం పెరిగి 150 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ్ అవుతోంది.

First Published:  23 Feb 2023 7:37 AM GMT
Next Story