Telugu Global
International

బ్రిట‌న్ ప్ర‌ధాని భ‌విత‌వ్యంపై జోరుగా బెట్టింగులు..

నూతనంగా ఎన్నికైనా బ్రిటన్ ప్రధాని లిజ్ ట్ర‌స్ భవిష్యత్తుపై అప్పుడే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొంద‌రు ఆమె ప్ర‌ధానిగా కొన‌సాగింపుపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.

బ్రిట‌న్ ప్ర‌ధాని భ‌విత‌వ్యంపై జోరుగా బెట్టింగులు..
X

ఆర్ధిక సంక్షోభం, మార్కెట్ల గంద‌ర‌గోళ ప‌రిస్థితుల మ‌ధ్య‌ బ్రిట‌న్ ప్ర‌ధాని లిజ్ ట్ర‌స్ భ‌విత‌వ్యంపై ఊహాగానాలు వ‌స్తున్నాయి. కొంద‌రు ఆమె ప్ర‌ధానిగా కొన‌సాగింపుపై బెట్టింగులు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మినీ బ‌డ్జెట్ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. ఆర్ధిక మంత్రి క్వార్టెంగ్ ప‌న్నులు త‌గ్గించేది లేదంటూ స్ప‌ష్టం చేయ‌డంతో మార్కెట్లు తీవ్ర గంద‌ర‌గోళానికి ఒత్తిడికి లోన‌య్యాయి. దీంతో తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగింది. దీనిపై ప్ర‌ధాని ట్ర‌స్ ఆర్ధిక మంత్రి క్వార్టెంగ్ ను ప‌ద‌వి నుంచి తొల‌గించి పార్ల‌మెంటు స‌భ్యుడిగా మాత్ర‌మే కొన‌సాగాల‌ని ఆదేశించారు.

ఈ నేప‌ధ్యంలో ఆమెను ఎలా తొలగించాలనే దానిపై ఇప్పటికే ఆమె ఎంపీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ ప‌రిస్థితిని అనుకూలంగా మార్చుకుంటూ బెట్టింగ్ ఏజెన్సీలు తమ సైట్‌లలో 'లిజ్ ట్రస్ స్పెషల్స్' పందాలను నిర్వ‌హిస్తున్నాయి. కోరల్ కంపెనీ బెట్టింగ్ కంపెనీలో ప్ర‌ధానికి ఈ సంవత్సరం 13/5 గా వ‌కాశాలు క‌నిపించాయి.

ఈ వేసవి టోరీ పార్టీ నాయకత్వ ఎన్నికలలో ట్రస్ తో పోటీ ప‌డి రెండవ స్థానంలో నిలిచిన రిషి సున‌క్ వైపు మొగ్గు చూపుతున్నారు పందెం రాయుళ్ళు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్రీమియర్‌ను బలవంతంగా తొలగించినట్లయితే రిషి సునక్ ఇప్పుడు స్కై బెట్ లో ప్రాధాన్యం గ‌ల వ్యక్తిగా నిలుస్తున్నారు. మాజీ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ రిషి పోటీ సమయంలో ట్రస్ ప్రణాళికలు మార్కెట్ పతనానికి దారితీస్తాయని హెచ్చరించాడు. ఆమె తర్వాత రిషికి అవకాశాలు 2/1 గా ఉన్నాయి.

స్కాంలో చిక్కుకుని ప‌ద‌వి నుంచి దిగిపోయిన‌ బోరిస్ జాన్సన్ తిరిగి అధికారంలోకి వ‌స్తాడ‌ని క‌ట్టే ప్ర‌తి 1 పౌండ్ పందెం కోసం స్కై బెట్ $11.30 చెల్లిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్య మంత్రి కెమీ బాడెనోచ్, విదేశాంగ మంత్రి జేమ్స్ క్ల‌వ‌ర్ ల కంటే జాన్స‌న్ కే ఎక్కువ మొగ్గు క‌న‌బ‌డుతోంది.

హౌస్ ఆఫ్ కామన్స్ లీడర్ పెన్నీ మోర్డాంట్ ,డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ ట్రస్ తర్వాత ఇతర ప్రముఖ టోరీ పోటీదారులుగా ఉన్నారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ కైర్ స్టార్‌మర్ స్కై బెట్ పందెంలో రెండవ వ్య‌క్తిగా ఉన్నారు. అయితే బుక్‌మేకర్‌ల అంచ‌నాలు 2024 వరకు తదుపరి ఎన్నికలు జరగవని సూచిస్తున్నాయి, రాబోయే రోజుల్లో లేదా వారాల్లో ట్రస్‌ పడిపోయినా అతనికి అవకాశాలు త‌క్కువేన‌ని సూచిస్తున్నాయి.

మార్కెట్ పరంగా, ఈ విషయాలను విశ్లేషించే నిపుణుల కంటే రిటైల్ పెట్టుబడిదారుల అభిప్రాయాలను వారు ప్రతిబింబిస్తారు. .

First Published:  15 Oct 2022 2:12 PM GMT
Next Story