Telugu Global
International

అమెరికాలో భారతీయుల పరువు తీసిన బాలయ్య ఫ్యాన్స్

బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహా రెడ్డి మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అమెరికాలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఓ థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ అరుపులు కేకలతో పేపర్లు చించి థియేటర్‌ మొత్తం కాగితాలతో నింపేస్తూ.. నానా హంగామా చేశారు.

అమెరికాలో భారతీయుల పరువు తీసిన బాలయ్య ఫ్యాన్స్
X

అమెరికాలో బాలకృష్ణ ఫ్యాన్స్ సృష్టించిన రచ్చతో భారతీయులు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేరే దేశానికి వెళ్ళినా ఇక్కడి పద్దతులు వదలకుండా మన ఊర్లో ప్రవర్తించినట్టే ప్రవర్తించడం హీరోల ఫ్యాన్స్ కు అలవాటుగా మారింది.

హీరోల కటౌట్ లు పెట్టి, వందలాది కార్లతో ఊరేగింపులు... రోడ్లపై హంగామా... హీరోలకు జైజైలు కొడుతూ నినాదాలు.. ట్రాఫిక్ కు అంతరాయాలు...ఇవన్నీ ఇండియాలో ఎలాగూ జరుగుతాయి. అమెరికాకు పోయిన మన తెలుగు వాళ్ళు అక్కడ కూడా ఇదే పద్దతి కొనసాగిస్తూ స్థానికులకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.


ఈ రోజు బాలకృష్ణ ఫ్యాన్స్ చేసిన రచ్చ భరించలేక ఓ థియేటర్ యాజమాన్యం సినిమా ఆపేసి అందరినీ బైటికి వెళ్ళగొట్టింది.

బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహా రెడ్డి మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అమెరికాలో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఓ థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ అరుపులు కేకలతో పేపర్లు చించి థియేటర్‌ మొత్తం కాగితాలతో నింపేస్తూ.. నానా హంగామా చేశారు. థియేటర్ లోనే డ్యాన్సులు చేశారు...జై బాలయ్య అంటు నినాదాలు చేశారు...ఇలా థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. వీరి రచ్చ భరించలేని థియేటర్ యాజమాన్యం అర్దాంతరంగా మూవీ ప్రదర్శనను నిలిపేసింది. సెక్యూరిటీ సహాయంతో అందరినీ థియేటర్ నుంచి బైటికి వెళ్ళగొట్టింది.


గతంలో తాము ఎన్నో తెలుగు సినిమాలను ప్రదర్శించామని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని యాజమాన్యం వెల్లడించింది. ఈ ఒక్క థియేటర్‌లోనే కాదు యూఎస్‌లోని అన్ని థియేటర్‌లలో బాలయ్య అభిమానులు ఇదే రచ్చ చేస్తున్నారట. కొన్ని థియేటర్లలో జై బాలయ్య నినాదాలు చేయొద్దని యాజమాన్యాలు చెప్పినా ఫ్యాన్స్ పట్టించుకోవడం లేదు.

థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ చేసిన హంగామా....వారిని బైటికి పంపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. మనదేశ పరువును తీశారని కొందరు వాపోతుండగా, ఆంధ్రా అయినా.. అమెరికా అయినా బాలయ్య సినిమా అంటే అలాగే ఉంటుంది అంటూ పలువురు నెటిజనులు కామెంట్స్‌ చేస్తున్నారు.


First Published:  12 Jan 2023 7:37 AM GMT
Next Story