Telugu Global
International

పాక్ లో ఆకలి కేక‌లు... గోదుమ పిండి కోసం తొక్కిసలాట, 11 మందిమృతి!

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ పంపిణీ కేంద్రాల్లో ఉచిత గోదుమ‌పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో మహిళలతో సహా కనీసం 11 మంది మరణించారని అధికారులు తెలిపారు.

పాక్ లో ఆకలి కేక‌లు... గోదుమ పిండి కోసం తొక్కిసలాట, 11 మందిమృతి!
X

పాకిస్తాన్ లో ఆర్ధిక సంక్షోభం రోజు రోజుకు పెరిగిపోతోంది. తినడానికి ఆహారంలేక పాకిస్తాన్ అంతటా ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. గోదుమపిండి కోసం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత‌ పడ్డారు.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ పంపిణీ కేంద్రాల్లో ఉచిత గోదుమ‌పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో మహిళలతో సహా కనీసం 11 మంది మరణించారని అధికారులు తెలిపారు.

ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం పేదలకు, ప్రత్యేకించి పంజాబ్ ప్రావిన్స్‌లో ఉచిత గోదుమ‌పిండి పథకాన్ని ప్రవేశపెట్టింది. వేలాదిగా ప్రజలు గోదుమపిండి కోసం ప్రభుత్వ పంపిణీ కేంద్రాలకు తరలి రావడంతో ప్రతి రోజు తొక్కిసలాటలు, ఘర్షణలు జరుగుతున్నాయి.

దక్షిణ పంజాబ్‌లోని సాహివాల్, బహవల్‌పూర్, ముజఫర్‌గఢ్, ఒకారా, ఫసైలాబాద్, జెహానియన్, ముల్తాన్. జిల్లాల్లోని ఉచిత పిండి కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఇద్దరు వృద్ధ మహిళలు సహా 11 మంది మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు.

ఉచిత పిండి కోసం క్యూలలో ఉన్న పౌరులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి అల్లకల్లోల‍ సృష్టిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ముజఫర్‌ఘర్, రహీమ్ యార్ ఖాన్ నగరాల్లో ఉచిత పిండి ట్రక్కులను ప్రజలు లూటీ చేయడంతో ప్రభుత్వం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది.

పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ప్రభుత్వానికి ఉచిత గోదుమ పిండి కేంద్రాలను నిర్వ‌వహించడం కూడా రావడంలేదనిమాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. అమాయక ప్రజల మరణాలకు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నఖ్వీ బాధ్యులని ఆయన ఆరోపించారు."దొంగల ప్రభుత్వం" ప్రజల జీవితాలను చాలా దుర్భరంగా మార్చిందని ఖాన్ అన్నారు.

First Published:  30 March 2023 2:20 AM GMT
Next Story