Telugu Global
International

యూఏఈ గోల్డెన్ వీసాదారులకు మరో అద్భుతావకాశం..

UAE's Golden Visa: అక్టోబర్ 3వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన గోల్డెన్ వీసా పథకంలో భాగంగా పేరెంట్స్ అంశాన్ని కూడా ఒక భాగంగా చేర్చారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా అరేబియన్ బిజినెస్ సెంటర్‌లో ఆపరేషన్ మేనేజర్ ఫిరోసేఖాన్ వెల్లడించారు.

యూఏఈ గోల్డెన్ వీసాదారులకు మరో అద్భుతావకాశం..
X

యూఏఈ గోల్డెన్ వీసాదారులకు మరో అద్భుతావకాశం..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని గోల్డెన్ వీసాదారులకు మరో అద్భుతావకాశాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది. ఆ దేశంలో దీర్ఘకాలం పాటు ఎలాంటి పరిమితులు లేకుడా స్వేచ్ఛగా నివాసం ఉండేందుకు ఈ గోల్డెన్ వీసా అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఈ గోల్డెన్ వీసాదారులు తమ తల్లిదండ్రులకు కూడా పదేళ్ల పాటు రెసిడెన్సీ కోసం స్పాన్సర్ చేయవచ్చు. ఈ గోల్డెన్ వీసాను వివిధ రంగాల్లో అంటే కళలు, క్రియేటివిటీ పరిశ్రమలు, సాహిత్యం, కల్చర్‌, విద్య, వారసత్వ సంపద చరిత్ర గురించి అధ్యయనం చేసేవాళ్లు, సేవలు అందిస్తున్న వాళ్లకు జారీ చేస్తారు.

అక్టోబర్ 3వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన గోల్డెన్ వీసా పథకంలో భాగంగా పేరెంట్స్ అంశాన్ని కూడా ఒక భాగంగా చేర్చారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా అరేబియన్ బిజినెస్ సెంటర్‌లో ఆపరేషన్ మేనేజర్ ఫిరోసేఖాన్ వెల్లడించారు. ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ నిర్దేశాల మేరకు ప్రవాస ఉద్యోగులు ప్రతి పేరెంట్‌కి డిపాజిట్ చెల్లించి ఒక ఏడాది పాటు స్పాన్సర్ చేయవచ్చు. అయితే గోల్డెన్ వీసాదారులకు మాత్రం ఈ చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే వీరు తమ సంబంధిత కాన్సులేట్‌లు జారీ చేసిన ప్రామాణిక పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని ఫిరోసేఖాన్ తెలిపారు.

20 వేల దిర్హమ్స్(రూ.4.41లక్షలు) నెలవారీ జీతం కలిగిన యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు పేరెంట్స్‌కు స్పాన్సర్ చేయవచ్చు. అయితే ఈ నిబంధన గోల్డెన్ వీసాదారులకు వర్తించదు. అక్టోబర్ 3 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెసిడెన్సీ, విజిట్ వీసా విధానం కొత్త రెసిడెన్సీ ట్రాక్స్, ఎంట్రీ పర్మిట్‌లను ప్రవేశపెట్టింది. ఈ వీసా సవరణ పథకాల్లో భాగమే గోల్డెన్ వీసా స్కీమ్. ఈ సవరణల్లో భాగంగానే గోల్డెన్ వీసాదారులకు పలు వెసులుబాట్లు కల్పించారు. ముఖ్యంగా గోల్డెన్ వీసాదారులు వయోపరిమితితో సంబంధం లేకుండా పిల్లలకు స్పాన్సర్ చేయవచ్చు. అలాగే వీరు స్పాన్సర్ చేసే సహాయక సిబ్బంది సంఖ్య విషయంలో ఎలాంటి పరిమితులూ ఉండవు.

First Published:  16 Nov 2022 6:13 AM GMT
Next Story