Telugu Global
International

కంపెనీ లక్కీ డ్రాలో ఏడాది పెయిడ్ లీవ్స్ గెలిచిన ఉద్యోగి

లక్కీ డ్రాలో ఉద్యోగులకు లీవులు గిఫ్టుగా ఇచ్చింది. ఇలా చెన్ అనే ఉద్యోగి ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్స్ డ్రాలో గెలుచుకున్నాడు.

కంపెనీ లక్కీ డ్రాలో ఏడాది పెయిడ్ లీవ్స్ గెలిచిన ఉద్యోగి
X

లక్కీ డ్రా తీస్తే డబ్బులో, వస్తువులో, కార్లో, టూర్లో గెలవడం చూశాము. అయితే ఒక కంపెనీ ఉద్యోగుల కోసం పెట్టిన లక్కీ డ్రాలో ఏకంగా ఏడాది పాటు పెయిడ్ లీవ్స్ గెలుచుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు తీవ్రమైన టెన్షన్‌ అనుభవిస్తున్నారు. చైనాలో కోవిడ్ ప్రభావం ఉద్యోగులకు ఎక్కువగానే పడింది. వారాల తరబడి ఆఫీసుల్లోనే ఉంటూ పనులు చేస్తున్నారు. ఆ స్ట్రెస్ నుంచి బయటపడేసేందుకు చైనాలోని షెన్‌జెన్ నగరంలోని ఓ కంపెనీ డిన్నర్ పార్టీ అరేంజ్ చేసింది. ఆ పార్టీ ముగిసిన తర్వాత ఉద్యోగులందరికీ లక్కీ డ్రా నిర్వహించింది. తమకు డబ్బులు వస్తాయని అందరూ భావించగా.. మేనేజ్‌మెంట్ ఇచ్చిన గిఫ్టులు చూసి ఆశ్చర్యపోయారు.

లక్కీ డ్రాలో ఉద్యోగులకు లీవులు గిఫ్టుగా ఇచ్చింది. ఇలా చెన్ అనే ఉద్యోగి ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్స్ డ్రాలో గెలుచుకున్నాడు. లక్కీ డ్రాకు సంబంధించిన చెక్ మీద 365 పెయిడ్ లీవ్స్ అని రాసి ఉండటంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక చాలా మంది ఉద్యోగులకు ఒకటి, రెండు పెయిడ్ లీవ్స్ లక్కీ డ్రాలో వచ్చాయి. అయితే ఏడాది పెయిడ్ లీవ్స్ గెలిచిన ఉద్యోగి.. వాటిని వాడుకుంటాడా లేదంటే ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటాడా అని మాత్రం ఇంకా తెలియరాలేదు.

అయితే ఈ లక్కీ డ్రా నిర్వహించిన కంపెనీ పేరు మాత్రం బయటకు రాలేదు. కానీ, చెన్ ఈ డ్రా గెలిచినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చాలా మంది నువ్వు చాలా లక్కీ బ్రో.. అంటుండగా... మరి కొంత మంది మాత్రం అసూయ పడుతున్నారు. నువ్వు ఏడాది లీవ్ తీసుకుంటే.. వచ్చే సరికి నీ ప్లేసులో వేరే వాళ్లు ఉంటారు బాస్ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


First Published:  15 April 2023 7:31 AM GMT
Next Story