Telugu Global
International

ఆ దేశంలో మిలటరీకి, పారా మిలటరీకి మధ్య యుద్దం.... భారతీయులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ ఎంబసీ

సుడాన్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) అధ్యక్ష భవనం, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ నివాసం, ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నాయి. ఉత్తర నగరమైన మెరోవ్, దక్షిణాన ఎల్-ఒబీద్‌లోని మరో రెండు విమానాశ్రయాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు RSF ఒక ప్రకటనలో తెలిపింది.

ఆ దేశంలో మిలటరీకి, పారా మిలటరీకి మధ్య యుద్దం.... భారతీయులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ ఎంబసీ
X

సుడాన్ దేశ మిలటరీ, పారామిలిటరీ బలగాల మధ్య ఉద్రిక్తతల మధ్య సుడాన్ రాజధాని నిరంతర కాల్పుల మోతతో హోరెత్తుతోంది. దాంతో సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవ్వరూ ఇంట్లో నుంచి బైటికి రావద్దని కోరింది.

మీడియా నివేదికల ప్రకారం, సెంట్రల్ ఖార్టూమ్, బహ్రీ పరిసరాలతో సహా అనేక ప్రాంతాలలో భారీ కాల్పుల శబ్దాలు వినిపించాయి.

సుడాన్ పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) అధ్యక్ష భవనం, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్ నివాసం, ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నాయి. ఉత్తర నగరమైన మెరోవ్, దక్షిణాన ఎల్-ఒబీద్‌లోని మరో రెండు విమానాశ్రయాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు RSF ఒక ప్రకటనలో తెలిపింది.

రాజధాని దక్షిణ భాగంలో RSF దళాలు తమ బలగాలపై తీవ్ర దాడి చేయడంతో తాము అలసిపోయామని దాంతో వారు విమానాశ్రయాలను ఆక్రమించుకున్నారని సూడాన్ ఆర్మీ తెలిపింది. సైన్యం RSFని "తిరుగుబాటు దళం"గా ప్రకటించింది.

అక్టోబర్ 2021లో జరిగిన తిరుగుబాటులో సుడాన్ లో మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటి నుండి అది సార్వభౌమ మండలి ద్వారా దేశాన్ని నడుపుతోంది. పౌర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించే ప్రతిపాదిత కాలక్రమంపై సైన్యం, పారా మిలటరీ మధ్య కొన్ని వారాలుగా వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్ళింది.

దేశాన్ని మిలటరీనే పాలించాలని ఆర్మీ కోరుకుంటుండగా , పౌరప్రభుత్వానికి అధికారం అప్పగించాలని పారా మిలటరీ డిమాండ్ చేస్తోంది. పైగా పారా మిలటరీని సైన్యంలో కలిపేయాలన్న సైన్యాధి నేత అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ డిమాండ్ ను పారా మిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో వ్యతిరేకిస్తున్నారు.

First Published:  16 April 2023 1:56 AM GMT
Next Story