Telugu Global
International

పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. 9 మంది మృతి

ఖైబర్ ఫ‌ఖ్తుంఖ్వా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జూలై 30వ తేదీన ఒక రాజకీయ పార్టీ సమావేశంలో ఇదేవిధంగా ఆత్మాహుతి దాడి జరిగింది.

పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. 9 మంది మృతి
X

పాకిస్తాన్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది సైనికులు చనిపోయారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దులోని ఖైబర్ ఫ‌ఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లాలో ఆర్మీ కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఆత్మాహుతి బాంబర్ మోటార్‌సైకిల్‌పై ఎదురు వెళ్లినట్టు భద్రతా అధికారులు తెలిపారు. ఘటనపై పాకిస్తాన్ తాత్కాలిక పీఎం అన్వర్ ఉల్ హక్ కకర్ విచారం వ్యక్తం చేశారు.

ఈ దాడికి పాల్పడింది తామే అని పాకిస్తాన్ తాలిబన్లు ప్రకటించారు. పాకిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘన్ తాలిబాన్ నుంచి ఒక ప్రత్యేక సమూహం.

ఖైబర్ ఫ‌ఖ్తుంఖ్వా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. జూలై 30వ తేదీన ఒక రాజకీయ పార్టీ సమావేశంలో ఇదేవిధంగా ఆత్మాహుతి దాడి జరిగింది. బాంబర్ పేలుడులో పాల్పడటంతో 54 మంది మరణించారు, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మొత్తానికి ఉగ్రవాదులకు స్వర్గధామం అయిన పాకిస్తాన్ ఇప్పుడు అంతర్గత ఉగ్రవాదులతో పోరాడుతోంది. ఆత్మాహుతి దాడులు ఎలా చేయాలి..? ఎన్ని రకాలుగా చేయొచ్చు..? లాంటి పాఠాలు బోధించే యూనివర్సిటీలాంటి పాకిస్తాన్ ఇప్పుడు వరుస ఆత్మహుతి దాడులతో ప్రాక్టికల్ ను ఫేస్ చేస్తోంది.

పాకిస్తాన్‌ను వణికిస్తున్న ఉగ్ర సంస్థ తెహ్రికే పాకిస్తాన్‌ తాలిబన్‌-టీటీపీ ఉగ్రసంస్థ అయితే తాను పాకిస్తాన్ ప్రత్యేక సంస్థ కాదని.. ఆఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్ల శాఖగా ఇప్పటికే ప్రకటించుకుంది. ఒకప్పుడు పాలు పోసి పెంచిన ఉగ్ర సంస్థ.. ఇప్పుడు పాకిస్తాన్‌నే కబలిస్తోంది.

*

First Published:  1 Sep 2023 3:16 AM GMT
Next Story