Telugu Global
International

పాక్ లో బస్సు ‍ ప్రమాదం - 40 మంది మృతి!

ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని, బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని, వంతెనపై ఉన్న పిల్లర్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంజుమ్ తెలిపారు.

పాక్ లో బస్సు ‍ ప్రమాదం - 40 మంది మృతి!
X

నైరుతి పాకిస్థాన్‌లో ఓ మినీ బస్సు వంతెనపై నుంచి కింద‌ పడి మంటలు చెలరేగడంతో కనీసం 40 మంది మరణించారని ప్రభుత్వ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు.

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని లాస్బెలా జిల్లాకు చెందిన సీనియర్ అధికారి హమ్జా అంజుమ్ ప్రమాద స్థలంలో మాట్లాడుతూ, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయన్నారు

ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని, బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారని, వంతెనపై ఉన్న పిల్లర్‌ను ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంజుమ్ తెలిపారు.

హైవేలు సరిగా లేకపోవడం, భద్రతలో నిర్లక్ష్యం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తదితరాలవల్ల పాకిస్తాన్ లో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్యాసింజర్ బస్సుల్లో సామర్థ్యానికి మించి కిక్కిరిసి ఉంటాయి దాంతో వాహన ప్రమాదాల వల్ల‌ మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, 2018లో పాకిస్తాన్ రోడ్డు ప్రమాదాల్లో 27,000 మందికి పైగా మరణించారు.

First Published:  29 Jan 2023 8:47 AM GMT
Next Story