Telugu Global
International

శ్రీలంకలో 30 శాతం పెరిగిన సెక్స్ వర్కర్లు..

దీంతో గతిలేక వస్త్ర పరిశ్రమకు చెందిన మహిళలంతా ఇప్పుడు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని తెలుస్తోంది. ఒంటరి మహిళలే కాదు, కుటుంబ పోషణ కోసం, చిన్న పిల్లల అవసరాలు తీర్చడానికి తల్లులు వేశ్యలుగా మారుతున్నారు.

శ్రీలంకలో 30 శాతం పెరిగిన సెక్స్ వర్కర్లు..
X

శ్రీలంక ఆర్థిక సంక్షోభం కారణంగా అక్కడ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మహిళలు జీవనోపాధి కరువై సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. గతం కంటే ఇప్పుడు శ్రీలంకలో సెక్స్ వర్కర్ల సంఖ్య 30 శాతం పెరిగినట్టు చెబుతున్నారు. కడుపు నింపుకోడానికి పడుపు వృత్తిని ఎంచుకుంటున్నారు చాలామంది. గతంలో బాగా బతికిన కుటుంబాలు, ఉద్యోగాలు చేసిన మహిళలు కూడా ఇప్పుడు గతిలేక వేశ్యలుగా మారుతున్నారు.

శ్రీలంకలో వస్త్ర పరిశ్రమలు మూతపడటం వల్ల లక్షలాదిమంది కార్మికులు రోడ్డునపడ్డారు. ముఖ్యంగా మహిళలు ఉపాధి లేక, నెలజీతం రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మారుతుందనే ఆశ వారికి లేదు. దీంతో గతిలేక వస్త్ర పరిశ్రమకు చెందిన మహిళలంతా ఇప్పుడు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని తెలుస్తోంది. ఒంటరి మహిళలే కాదు, కుటుంబ పోషణ కోసం, చిన్న పిల్లల అవసరాలు తీర్చడానికి తల్లులు వేశ్యలుగా మారుతున్నారు.

ప్రత్యామ్నాయం లేదు..

ఒకచోట ఉద్యోగం పోతే అదే రంగంలోనో, లేక మరొక రంగంలో ఉపాధి వెదుక్కుంటారు చాలామంది. ఇప్పుడు అలాంటి ప్రత్యామ్నాయాలేవీ శ్రీలంకలో కనిపించడంలేదు. దాదాపుగా అన్నిరంగాలు కుదేలయ్యాయి, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, ఉపాధి లేదు, ఉద్యోగాల్లేవు, చివరకు పడుపు వృత్తే వారికి దిక్కయింది. ఇండస్ట్రియల్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో సెక్స్ వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇలాంటి వేశ్యాగృహాలకు పోలీసుల సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇండస్ట్రియల్ జోన్లలో ఉన్నవారంతా దగ్గర్లోని కర్మాగారాలలో ఉద్యోగాలు చేసేవారు, ఇప్పుడు వారంతా ఉపాధి కోల్పోయారు.

డబ్బులకు బదులుగా..

ఆహారం, మందులకు డబ్బుల్లేక స్థానిక దుకాణదారులకు తమ శరీరాన్ని అప్పగిస్తున్న అబలలు కూడా ఉన్నారు. దిక్కులేక అవసరానికి ఇలా తాత్కాలికంగా వేశ్యలుగా మారుతున్నారు శ్రీలంక మహిళలు.

First Published:  21 July 2022 5:55 AM GMT
Next Story