Telugu Global
International

12వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ఫేస్‌బుక్

చాలా మంది కంపెనీని వీడి ఇతర సంస్థల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, వారిని తొలగిస్తుండటమే అసలు కారణమని.. చాలా మంది ఉద్యోగుల ఇంకా ప్రత్యామ్నాయాలను కూడా వెతుక్కోలేదని తెలుస్తున్నది.

12వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ఫేస్‌బుక్
X

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా 12,000 మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. రాబోయే కొన్ని వారాల్లో కంపెనీ నుంచి 15 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇప్పటికే కంపెనీ ఇంటర్నల్ మెయిల్స్‌లో తెలియజేసినట్లు సమాచారం. ప్రతీ డిపార్ట్‌మెంట్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్స్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తున్నది. కంపెనీ నుంచి 15 శాతం ఉద్యోగులను ఇంటికి పంపించాలని తీసుకున్న నిర్ణయం నిజమేనని కంపెనీ ఎంప్లాయీస్ చెబుతున్నారు.

చాలా మంది కంపెనీని వీడి ఇతర సంస్థల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, వారిని తొలగిస్తుండటమే అసలు కారణమని.. చాలా మంది ఉద్యోగుల ఇంకా ప్రత్యామ్నాయాలను కూడా వెతుక్కోలేదని తెలుస్తున్నది. నెల రోజుల క్రితమే కొత్త ఉద్యోగుల చేరికపై మెటా నిషేధం విధించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ప్రస్తుతం మెటా స్టాక్ ప్రైజ్ 380 డాలర్లుగా ఉన్నది. కానీ, గత ఏడాదిలో మెటా షేర్ వాల్యూ దాదాపు 60 శాతం పడిపోయింది. ఇది కంపెనీ కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపింది. అందుకే కాస్ట్ కటింగ్ కోసం ప్రతీ డిపార్ట్‌మెంట్, వెర్టికల్ నుంచి ఉద్యోగులను తొలగించి.. చిన్న టీమ్స్ ఏర్పాటు చేయాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.

ఏడాదిలోగా కంపెనీలోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ పోవడమే తమ లక్ష్యమని జుకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. చిన్న టీమ్ ఉన్నా.. వారిపై బాధ్యతలు పెరగనున్నాయని, ఇందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఉద్యోగులను తొలగిస్తూ లేదా ఇతర డిపార్ట్‌మెంట్లకు బదిలీ చేస్తూ త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. 30 నుంచి 60 రోజుల నోటీస్ పిరియడ్ ఉంటుందని.. ఇతర డిపార్‌మెంట్లకు వెళ్లకపోతే వాళ్లు కూడా బయటకు వెళ్లాల్సిందేనని అధికారులు చెప్తున్నారు.

తొలగించబోయే ఉద్యోగులందరికీ ఇప్పటికే శాలరీ అడ్వాన్సులు చెల్లించారు. కంపెనీ నుంచి రావల్సిన ఇతర బెనిఫిట్స్ అన్నీ చివరి రోజు అందించనున్నారు. ఆర్థిక మాంద్యంతోనే ఉద్యోగులను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లోని ఫేస్‌బుక్ ఆఫీసులో మాత్రం ఈ తొలగింపులు ఇప్పుడు ఉండబోవడం లేదని తెలుస్తున్నది.

First Published:  7 Oct 2022 4:46 AM GMT
Next Story