Telugu Global
International

కాబూల్ ప్రభుత్వ స్కూల్ పై ఆత్మాహుతి దాడి 100 మంది పిల్లల మృతి !

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 100 మంది విద్యార్థులు మరణించారు. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ (ISKP) ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు అధికారులు చెప్తున్నారు.

కాబూల్ ప్రభుత్వ స్కూల్ పై ఆత్మాహుతి దాడి 100 మంది పిల్లల మృతి !
X

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ఓ పాఠశాలపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికి పైగా పిల్లలు మరణించినట్టు తెలుస్తోంది. మరణించిన పిల్లలంతా హజారాలు, షియాలు. హజారాలు ఆఫ్ఘనిస్తాన్ లో మూడవ అతిపెద్ద జాతి.

కాబూల్ కు పశ్చిమాన ఉన్న దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలోని కాజ్ విద్యా కేంద్రంలో పేలుడు సంభవించిందని బీబీసీ నివేదించింది.

చేతులు, కాళ్ళు తెగిపోయి, శరీరాలు ఛిద్రమై పాఠశాల మొత్తం రక్తసిక్తమయ్యింది.

స్థానిక జర్నలిస్ట్ బిలాల్ సర్వారీ ట్వీట్ చేస్తూ, "మేము ఇప్పటివరకు 100మంది విద్యార్థుల‌ మృతదేహాలను లెక్కించాము. మరణించిన విద్యార్థుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువ. తరగతి గది శవాలతో నిండిపోయింది. ఈ రోజు విద్యార్థులకు ప్రవేశ పరీక్ష మాక్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నందువల్ల ఎక్కువ మంది విద్యార్థులున్నారు.'' అని ట్వీట్ లో పేర్కొన్నారు.

పశ్చిమ కాబూల్‌లోని దష్తే బార్చెను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ (ISKP) ఉగ్రవాదులు నిత్యం ఇక్కడ మారణహోమానికి తెగబడుతూ ఉన్నారని అధికారులు చెప్తున్నారు. ఆ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది శరీరారానికి బాంబులు అమర్చుకొని క్లాస్ రూం లోకి వచ్చి తనను తాను పేల్చుకున్నాడు.

"కాజ్ ఉన్నత విద్యా కేంద్రంపై ఈరోజు జరిగిన దాడిని యుఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో నిండిన గదిని లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటు'' అని ఆఫ్ఘనిస్తాన్‌కు యుఎస్ మిషన్‌లో ఛార్జ్ డి అఫైర్స్, కరెన్ డెక్కర్ ఒక ట్వీట్లో పేర్కొన్నారు.

"భద్రతా బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి, దాడి స్వభావం, మృతుల వివరాలు త్వ‌రలో విడుదల చేస్తాము. పౌర లక్ష్యాలపై దాడి చేయడం శత్రువు యొక్క అమానవీయ క్రూరత్వాన్ని,నైతిక ప్రమాణాలు లేకపోవడాన్ని రుజువు చేస్తుంది." అని ఆఫ్ఘన్ అధికారులు అన్నారు.


First Published:  30 Sep 2022 11:28 AM GMT
Next Story