Telugu Global
International

సెక‌న్‌లోపే 100 కి.మీ. వేగం.. ప్ర‌పంచంలోకెల్లా స్పీడ్ కారు ఇదే..!

స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన విద్యార్థుల బృందం డిజైన్ చేసిన‌ ఎల‌క్ట్రిక్ కారు 12.3 మీట‌ర్ల పొడ‌వు గ‌ల రేసింగ్ ట్రాక్‌ను సెక‌న్‌లోపు చేరుకోవ‌డంతోపాటు గంట‌కు100 కి.మీ స్పీడ్ న‌మోదు చేసింది. అంతేకాకుండా అత్యంత వేగంగా దూసుకెళ్ల‌గ‌ల ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో న‌మోదైంది.

సెక‌న్‌లోపే 100 కి.మీ. వేగం.. ప్ర‌పంచంలోకెల్లా స్పీడ్ కారు ఇదే..!
X

Super Hyper Car | క‌ర్బ‌న ఉద్గారాల నియంత్ర‌ణ‌కు ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆల్ట‌ర్నేటివ్ ఫ్యూయ‌ల్ ఆప్ష‌న్ల వైపు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నాయి. అందులోనూ ఎల‌క్ట్రిక్ కార్లు వ‌చ్చేస్తున్నాయి. వాటిల్లో ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే ఎల‌క్ట్రిక్ కారు ఏద‌న్న చ‌ర్చ సాగుతోంది. జ‌ర్మ‌నీలు మాత్రం ఆవిష్క‌రించ‌లేదు. బుగాట్టి అండ్ ఫెరారీ వంటి హైప‌ర్ కార్ల త‌యారీ సంస్థ‌లు సైతం ఆ ప‌ని చేయ‌లేక‌పోయాయి. స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన విద్యార్థుల బృందం సొంతంగా డిజైన్ చేసిన‌ ఎల‌క్ట్రిక్ కారు ఆ ఘ‌న‌త సాధించింది. రేసింగ్ ట్రాక్‌పై ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించారు కూడా. ఈ కారు 0.956 సెక‌న్ల‌లో అంటే క‌న్నుమూసి తెరిచేలోగా 0-100 కి.మీ స్పీడ్‌తో దూసుకెళుతుంద‌ని ధృవీక‌రించారు. 12.3 మీట‌ర్ల పొడ‌వు గ‌ల రేసింగ్ ట్రాక్‌ను ఈ కారు సెక‌న్‌లోపు చేరుకోవ‌డంతోపాటు గంట‌కు100 కి.మీ స్పీడ్ న‌మోదు చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా ఈ ప్రొటోటైప్ రేసింగ్ కారు అత్యంత వేగంగా దూసుకెళ్ల‌గ‌ల ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్‌గా న‌మోదైంది.

ఈ గిన్నిస్ బుక్ రికార్డ్‌ను స్విట్జ‌ర్లాండ్‌లోని జ్యురిచ్ స‌బ్ అర్బ‌న్ ప్రాంతం డుబెన్‌డార్ఫ్ ఈ నెల‌లో సొంతం చేసుకుంది. స్విస్ ఫెడ‌ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జ్యురిచ్ (ఈటీహెచ్‌జ‌డ్‌), లుసెర్న్ యూనివ‌ర్సిటీ ఆఫ్ అప్ల‌యిడ్ సైన్సెస్ విద్యార్థుల బృందం.. ఈ ఎల‌క్ట్రిక్ రేసింగ్ ప్రొటోటైప్ కారును డెవ‌ల‌ప్ చేశారు. దీనికి `మిథ‌న్` అని పేరు కూడా పెట్టారు. జ్యురిచ్ అక‌డ‌మిక్ మోటార్ స్పోర్ట్స్ క్ల‌బ్‌లోనూ ఈ విద్యార్థుల బృందం భాగ‌స్వాములు. ప్ర‌స్తుతం ఈ మిథ‌న్ కారును ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించ‌డానికి స్విట్జ‌ర్లాండ్ ఇన్నోవేష‌న్ పార్క్‌లో ఉంచారు.

ఈ `మిథ‌న్ (Mythen)` బుల్లికారు గో-కార్ట్ సైజ్‌లో ఉంటుంది. దీని బ‌రువు 140 కిలోలే. లైట్ వెయిట్ కార్బ‌న్‌, అల్యూమినియం హానికాంబ్ స్ట్ర‌క్చ‌ర్‌తో మిథ‌న్ (Mythen)ను డెవ‌ల‌ప్ చేశారు. గ‌రిష్టంగా 326 హెచ్‌పీ

విద్యుత్ వెలువ‌రించ‌గ‌ల కెపాసిటీ గ‌ల ఫోర్ వీల్ హ‌బ్ ఎల‌క్ట్రిక్ మోటార్‌ను కూడా అభివృద్ధి చేశారు. ఈ మ‌హ‌త్త‌ర య‌జ్ఞంలో సుమారు 30 మంది విద్యార్థులు 12 నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డ్డారు. `స్క్రాచ్‌` నుంచి కారు డెవ‌ల‌ప్ చేశారు. డూబెన్‌డార్ప్ వ‌ర్క్‌షాప్‌లోనే ఈ కారులో ఉప‌యోగించిన ప్రింటెడ్ స‌ర్క్యూట్ బోర్డులు, చేసిస్‌, బ్యాట‌రీతోపాటు విడి భాగాల‌న్నీ అభివృద్ధి చేశారు.

గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో 1.461 సెక‌న్ల‌లో (గంట‌కు) 100 కి.మీ వేగంతో దూసుకెళ్ల గ‌ల ఎల‌క్ట్రిక్ కారును స్ట‌ట్‌గార్ట్ యూనివ‌ర్సిటీ విద్యార్థుల టీం ఆవిష్క‌రించింది. 2022లో అత్యంత వేగంగా దూసుకెళ్లే ఈవీ కారుగా ఇది గిన్నిస్‌బుక్ రికార్డు న‌మోదు చేసింది. ఈ రికార్డును `మిథ‌న్‌` ఈ ఏడాది బ్రేక్ చేసింది.

First Published:  14 Sep 2023 7:22 AM GMT
Next Story