Telugu Global
NEWS

బ్ల‌ర్ ఆప్ష‌న్‌తో న్యూడ్ ఫొటోల‌కు ఇన్‌స్టాగ్రామ్ చెక్‌

డైరెక్ట్ మెసేజ్‌లో ఇలాంటి న్యూడ్ ఫొటోల‌ను పంపిన వ్యక్తిని బ్లాక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అమ్మాయిలకు వేధింపుల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

బ్ల‌ర్ ఆప్ష‌న్‌తో న్యూడ్ ఫొటోల‌కు ఇన్‌స్టాగ్రామ్ చెక్‌
X

సోషల్‌ మీడియాలో అమ్మాయిల నగ్న ఫొటోలు షేర్‌ చేస్తామని బెదిరించడం.. ఆపై వారిని లైంగికంగా వేధించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి ఘ‌ట‌న‌లు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో వినియోగ‌దారుల ఆందోళ‌న‌ను అర్థం చేసుకున్న ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ల్లో ఎక్కడైనా న్యూడిటీ కనిపిస్తే దాన్ని ‘బ్లర్‌’ చేసేలా కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. లైంగిక నేరాలు, ఫొటోల దుర్వినియోగాన్ని కంట్రోల్ చేయ‌డానికి, అమ్మాయిల ప్రైవ‌సీని కాపాడ‌టానికి త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నామని ఇన్‌స్టా ప్ర‌క‌టించింది. ఈ కొత్త ఫీచర్లు అందులో భాగ‌మేనని చెప్పింది.

18 ఏళ్ల‌లోపు వ‌య‌సువారికి డిఫాల్ట్‌గా వ‌స్తుంది

ఈ బ్ల‌ర్ ఫీచ‌ర్ 18 ఏళ్లలోపు వయసున్న ఇన్‌స్టాగ్రామ్ యూజ‌ర్ల‌కు డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. 18 ఏళ్లు నిండిన యూజ‌ర్ల‌కు ఈ బ్ల‌ర్ ఫీచ‌ర్‌ను యాక్టివేట్ చేసుకోవాల‌ని ఇన్‌స్టానే నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ ఫీచర్‌తో న్యూడ్‌గా ఉన్న ఫొటోలు బ్ల‌ర్‌గా క‌నిపిస్తాయి.

పంపిన వ్య‌క్తిని బ్లాక్ చేయొచ్చు

డైరెక్ట్ మెసేజ్‌లో ఇలాంటి న్యూడ్ ఫొటోల‌ను పంపిన వ్యక్తిని బ్లాక్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అమ్మాయిలకు వేధింపుల నుంచి విముక్తి ల‌భిస్తుంది. అంతేకాకుండా పొర‌పాటున ఎవ‌రిదైనా న్యూడ్ ఫొటో బ‌య‌టికి వ‌చ్చినా అది అంద‌రికీ క‌న‌ప‌డ‌కుండా ఉంటుంది. కాబ‌ట్టి న్యూడ్ ఫొటోల పేరిట బెదిరించే నేరాల‌కు అడ్డుకట్ట ప‌డుతుంది.

సైబ‌ర్ నేరాల‌కూ బ్రేక్‌

అంతేకాదు న్యూడ్ ఫొటోలు పంపి, వాటిని క్లిక్ చేయ‌డం ద్వారా ఆన్‌లైన్ పాస్‌వ‌ర్డ్‌లు, ఈ-బ్యాంకింగ్ వ్య‌వ‌హారాల్లోకి చొర‌బ‌డి దోచుకునే ఆన్‌లైన్ స్కామ‌ర్ల‌కు కూడా బ్రేక్ వేయొచ్చు. త‌ద్వారా ఇది సెక్స్‌టార్ష‌న్‌నే కాదు సైబ‌ర్ క్రైమ్స్ కు కూడా అడ్డుక‌ట్ట వేసే అవ‌కాశం ఉంద‌ని ఇన్‌స్టాగ్రామ్ ప్ర‌క‌టించింది.

First Published:  12 April 2024 10:03 AM GMT
Next Story