Telugu Global
NEWS

2023లో 41 ల‌క్ష‌లు దాటిన కార్లు.. దాదాపు స‌గం మారుతి.. ఎస్‌యూవీల‌పైనే అంద‌రి మోజు..!

2023 జ‌న‌వ‌రి-డిసెంబ‌ర్ మ‌ధ్య కార్ల విక్ర‌యాలు 41.08 ల‌క్ష‌ల మార్క్‌ను దాటాయి. దేశ ఆటోమొబైల్ రంగంలో 40 ల‌క్ష‌ల యూనిట్ల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి

2023లో 41 ల‌క్ష‌లు దాటిన కార్లు.. దాదాపు స‌గం మారుతి.. ఎస్‌యూవీల‌పైనే అంద‌రి మోజు..!
X

దేశీయ మార్కెట్లో రోజురోజుకు కార్ల విక్ర‌యాలు పెరుగుతున్నాయి. ఇంత‌కుముందుతో పోలిస్తే స్పోర్ట్స్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎస్‌యూవీ)ల‌కు గిరాకీ పెరుగుతున్న‌ది. బుల్లి కార్ల‌తో పోలిస్తే ఎస్‌యూవీల విక్ర‌యాలు పెరిగాయి. రోజురోజుకు బుల్లి కార్ల‌కు, ఎస్‌యూవీల‌కు తేడా పెరుగుతున్న‌ది. 2023లో జ‌రిగిన మొత్తం కార్ల సేల్స్‌లో దాదాపు స‌గం మారుతి సుజుకి మోడ‌ల్ కార్లే. 2022తో పోలిస్తే 2023లో కార్ల విక్ర‌యాలు రికార్డు గ‌రిష్ట స్థాయిలో 41.08 ల‌క్ష‌ల యూనిట్లు అమ్ముడ‌య్యాయి. 20233 విక్ర‌యాల‌తో పోలిస్తే గ‌తేడాది 8.3 శాతానికి పైగా వృద్ధి చెందాయి. 2022లో స‌గ‌టున కారు ధ‌ర రూ.10.58 ల‌క్ష‌లు ప‌లికితే 2023లో స‌రాస‌రి రూ.11.5 ల‌క్ష‌ల‌కు పెరిగింది. మొత్తం సేల్స్‌లో మార్కెట్ లీడ‌ర్ మారుతి సుజుకితోపాటు హ్యుండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్‌, ట‌యోటా కిర్లోస్క‌ర్ మోటార్ కార్లు బెస్ట్‌గా నిలిచాయి.

2023 జ‌న‌వ‌రి-డిసెంబ‌ర్ మ‌ధ్య కార్ల విక్ర‌యాలు 41.08 ల‌క్ష‌ల మార్క్‌ను దాటాయి. దేశ ఆటోమొబైల్ రంగంలో 40 ల‌క్ష‌ల యూనిట్ల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి అని మారుతి సుజుకి సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్‌) శ‌శాంక్ శ్రీవాత్స‌వ మీడియాకు చెప్పారు. 2022లో 37.30 ల‌క్ష‌ల కార్లు అమ్ముడైతే.. 2023లో రిటైల్ కార్ల విక్ర‌యాలు 40.51 ల‌క్ష‌లు దాటొచ్చున‌ని అంచ‌నా వేశారు. కార్ల విక్ర‌యాల్లో వృద్ధిరేటు 8.6 శాతం న‌మోదవుతుంద‌ని భావిస్తున్నారు. మొత్తం కార్ల విక్ర‌యాల్లో ఎస్‌యూవీల సేల్స్ 26 శాతం వృద్ధి చెందాయ‌న్నారు.

ఓవ‌రాల్ కార్ల విక్ర‌యాల్లో ఎస్‌యూవీల వాటా 2022లో 42 శాతం ఉంటే గ‌తేడాది 48.7 శాతానికి పెరిగింది. హ్యాచ్‌బ్యాక్ మోడ‌ల్ కార్లు 34.8 శాతం నుంచి 30 శాతానికి, సెడాన్స్ 11 నుంచి 9.4 శాతానికి ప‌త‌నం కాగా, మ‌ల్టీ ప‌ర్ప‌స్ యుటిలిటీ వెహిక‌ల్స్ (ఎంవీపీ) కార్ల విక్ర‌యాలు య‌ధాత‌థంగా 8.7 శాతం వ‌ద్ద కొన‌సాగాయి. అయితే ఎస్‌యూవీ కార్ల విక్ర‌యాలు 50-55 శాతం వ‌ద్ద నిలిచిపోతాయ‌ని శ‌శాంక్ శ్రీవాత్సవ అంచ‌నా వేశారు. 2019లో స‌గ‌టున ఒక కారు ధ‌ర రూ.8.2 ల‌క్ష‌లు ఉంద‌ని, క‌మొడిటీ రేట్లు పెర‌గ‌డంతో నాలుగేండ్లుగా ధ‌ర‌లు పెరుగుతూ వ‌చ్చాయ‌న్నారు. అత్య‌ధిక విక్ర‌యాలు సాగుతున్న ఎస్‌యూవీల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తెలిపారు.

2023లో 20 ల‌క్ష‌ల యూనిట్లు విక్ర‌యించింది. ఒక ఏడాదిలో గ‌రిష్టంగా 2,69046 యూనిట్లు ఎగుమ‌తి చేయ‌డం ఇదే మొద‌టి సారి. ఒక ఏడాదిలో 20 ల‌క్ష‌ల యూనిట్ల‌కు పైగా అమ్ముడు కావ‌డం ఇదే ఫ‌స్ట్ టైం. గ్రామీణ ప్రాంతాల్లో 7.76 ల‌క్ష‌ల కార్లు, ప్రీ-ఓన్డ్ కార్ల విక్ర‌యాలు 4.68 ల‌క్ష‌ల యూనిట్లుగా నిలిచాయి.

2022తో పోలిస్తే హ్యుండాయ్ మోటార్ ఇండియా విక్ర‌యాలు తొమ్మిది శాతం వృద్ధి చెందాయి. 2023లో 7,65,786 కార్లు అమ్ముడ‌య్యాయి. 2022లో 7,00,811 కార్లు అమ్ముడ‌య్యాయి. 2022లో 5,52,511 యూనిట్లు విక్ర‌యిస్తే తొమ్మిది శాతం పెరిగి 2023లో 6,02,111 యూనిట్ల‌కు చేరాయ‌ని హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. టాటా మోటార్స్ సైతం గ‌తేడాది బెస్ట్ సేల్స్ జ‌రిగాయ‌ని వెల్ల‌డించింది.

First Published:  2 Jan 2024 11:23 AM GMT
Next Story