Telugu Global
NEWS

Hyundai Adventure Editions | ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై హ్యుండాయ్ న‌జ‌ర్‌.. త్వ‌ర‌లో క్రెటా.. అల్కాజ‌ర్ అడ్వెంచ‌ర్ ఎడిష‌న్ల ఆవిష్క‌ర‌ణ‌

Hyundai Adventure Editions | ఎక్స్‌ట‌ర్‌లో మాదిరిగా క్రెటా, అల్కాజ‌ర్ అడ్వెంచ‌ర్ కార్ల‌లో ఫ్రంట్‌, రేర్ బంప‌ర్ గార్నిష్‌, రూఫ్ రెయిల్స్‌, వింగ్ మిర్ర‌ర్స్‌, అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

Hyundai Adventure Editions | ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై హ్యుండాయ్ న‌జ‌ర్‌.. త్వ‌ర‌లో క్రెటా.. అల్కాజ‌ర్ అడ్వెంచ‌ర్ ఎడిష‌న్ల ఆవిష్క‌ర‌ణ‌
X

Hyundai Adventure Editions | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. ఎస్‌యూవీ మార్కెట్‌పై ప‌ట్టు కోసం వ‌డివ‌డిగా ముందుకు సాగుతున్న‌ది. అందులో భాగంగా భార‌త్ మార్కెట్‌లోకి క్రెటా, అల్కాజ‌ర్ ఎస్‌యూవీ స్పెష‌ల్ ఎడిష‌న్ కార్లు ఆవిష్క‌రించ‌నున్నది. అడ్వెంచ‌ర్ ఎడిష‌న్ పేరిట క్రెటా, అల్కాజ‌ర్ న్యూ మోడ‌ల్ కార్లు రాబోతున్నాయి. క్రెటా నైట్ ఎడిష‌న్ స్థానే అడ్వెంచ‌ర్ మోడ‌ల్‌తోపాటు అద‌నంగా అల్కాజ‌ర్ వ‌చ్చే నెలాఖ‌రులో గానీ, సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో గానీ మార్కెట్‌లోకి తీసుకువ‌స్తార‌ని తెలుస్తున్న‌ది.

క్రెటా నైట్ ఎడిష‌న్ మాదిరిగానే క్రెటా, అల్కాజ‌ర్ అడ్వెంచ‌ర్ ఎడిష‌న్ కార్లు పూర్తిగా కాస్మొటిక్స్ మార్పుల‌తో వ‌స్తున్నాయి. ఇటీవ‌ల హ్యుండాయ్ ఆవిష్క‌రించిన ఎక్స్‌ట‌ర్ మాదిరే రెండు ఎస్‌యూవీ కార్లూ కొత్త `రేంజ‌ర్ ఖాకీ` రంగులో వ‌స్తున్నాయి. టాటా కామో ఎడిష‌న్ మాదిరే డ్యుయ‌ల్ టోన్ ఫినిష్ విత్ కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్‌తో వ‌స్తున్నాయి.

ఎక్స్‌ట‌ర్‌లో మాదిరిగా క్రెటా, అల్కాజ‌ర్ అడ్వెంచ‌ర్ కార్ల‌లో ఫ్రంట్‌, రేర్ బంప‌ర్ గార్నిష్‌, రూఫ్ రెయిల్స్‌, వింగ్ మిర్ర‌ర్స్‌, అల్లాయ్ వీల్స్ ఉంటాయి. రెండు కార్ల‌లో ఆల్ బ్లాక్ ఫినిష్‌, సీట్ హెడ్‌రెస్ట్స్‌, డోర్ సిల్స్ వంటి ఇంటీరియ‌ర్ ట్రిమ్స్‌లో మార్కెట్లోకి రాబోతున్నాయి. రెండు కార్లలో అడ్వెంచ‌ర్ ఎడిష‌న్ బ్యాడ్జీలపై స్పెష‌ల్ పెయింట్ షేడ్ ఉంటుంది.

నైట్ ఎడిష‌న్‌లో మాదిరిగానే హ్యుండాయ్ క్రెటా అడ్వెంచ‌ర్ ఎడిష‌న్ 1.5 లీట‌ర్ల సామ‌ర్థ్యం గ‌ల పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు, అల్కాజ‌ర్ అడ్వెంచ‌ర్ కారు 1.5 లీట‌ర్ల ట‌ర్బో పెట్రోల్‌, డీజిల్ ఇంజిన్లు క‌లిగి ఉంటాయి. రెండు అడ్వెంచ‌ర్ ఎడిష‌న్ కార్ల‌లో మాన్యువ‌ల్‌, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిష‌న్ ఆప్ష‌న్ ఉంటాయి. రెగ్యుల‌ర్ ప్రీమియం కార్ల కంటే హ్యుండాయ్ క్రెటా అండ్ అల్కాజ‌ర్ అడ్వెంచ‌ర్ కార్ల ధ‌ర‌లు కాస్త ఎక్కువ‌గా ఉంటాయ‌ని తెలుస్తున్న‌ది.

First Published:  26 July 2023 11:30 AM GMT
Next Story